హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపేలా అధికారులు కీలక ప్రణాళికను సిద్ధం చేశారు. బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న ఈ కీలక జంక్షన్‌లో పాదచారుల భద్రతతో పాటు వాహనాల నిరంతర రాకపోకల కోసం వలయాకార స్కైవాక్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇకపై పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రమాదాలు ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.
Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు
A new skywalk in Hyderabad
ఆరాంఘర్ జంక్షన్ శంషాబాద్, కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు, అలాగే చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటీవల ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో పాదచారుల కదలిక సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నలువైపుల నుంచి సులభంగా రహదారి దాటేలా స్కైవాక్‌ను డిజైన్ చేయనున్నారు.
ఈ స్కైవాక్‌లో వృద్ధులు, దివ్యాంగుల కోసం అధునాతన లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. పాదచారుల కోసం వాహనాలను ఆపాల్సిన అవసరం తగ్గడంతో కింద రోడ్డుపై ట్రాఫిక్ ప్రవాహం మరింత సాఫీగా కొనసాగుతుంది. ఇది ప్రమాదాల ముప్పును గణనీయంగా తగ్గించడమే కాకుండా, విమానాశ్రయ ప్రయాణికుల సమయాన్ని కూడా ఆదా చేస్తుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: