📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి

Author Icon By Tejaswini Y
Updated: February 5, 2026 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ACB Raids Hyderabad : నగర ప్రజలకు సేవలందించే జీహెచ్ఎంసీలో పరిపాలన పరంగా ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, అవినీతి, అక్రమాలకు బ్రేక్ పడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కమిషనర్లుగా వచ్చిన ఉన్నతాధికారులంతా అవినీతిని కట్టడి చేస్తామని గొప్పగా ప్రకటనలు చేసినా, క్షేత్ర స్థాయిలో అవి ఫలించకపోవటం వల్లే రోజు రోజుకు అవినీతి పెరిగిపోతుందన్న వాదనలున్నాయి. గడిచిన ఏడాది నుంచి అధికారులను లంచం తీసు కుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా, అక్రమార్కులు కనీసం భయపడటం లేదు.

Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

అక్రమాలను అడ్డుకునేందుకు కొత్త సంస్కరణ

అవినీతి, అక్రమాలను అడ్డుకునేందుకు కొత్త సంస్కరణలను తీసుకువస్తున్నామని అధికారులు చేస్తున్న ప్రకటనలు క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం అమలు కాకపోవటం, లంచం తీసుకుని పట్టుబడిన తర్వాత శిక్షలు కఠినంగా ఉండకపోవటం, చట్టంలోని లొసుగులతో అవినీతి యథావిథి గా కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. తాజాగా కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన భారీ అవినీతి ఉదంతం కలకలం రేపుతోంది. రూ.15 లక్షలు లంచం తీసుకొని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) చిన్నారెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. నగరంలోని చెరువుల్లో గుర్ర పుడెక్క తొలగించే పనుల కోసం జీహెచెఎంసీ ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో ఒక కాంట్రాక్టర్ సుమారు రూ. 1.40 కోట్ల విలువైన పనులను దక్కించుకుని, విజయవంతంగా పూర్తి చేశాడు.

ACB Raids Hyderabad

ఆ పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయడానికి కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఎస్ ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డి అడ్డంకులు సృష్టించారు. సదరు బిల్లులు పాస్ చేయాలంటే రూ.40 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ డిమాండ్ చేశారు. చిన్నారెడ్డి డిమాండ్ విసిగిపోయిన కాంట్రాక్టర్ చివరకు రూ.30 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 15 లక్షలను బుధవారం అందజేయాల్సి ఉంది. అయితే బాధితుడు ముందుగానే ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహంతో నిఘా పెట్టారు. కూకట్పల్లి కార్యాలయంలో చిన్నారెడ్డి సూచన మేరకు.. ఆయన వద్ద పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ ఆ లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. నిందితుల చేతుల నుండి కెమికల్ టెస్ట్ ద్వారా లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల ఎసిబికి పట్టుబడ్డ జీహెచ్ఎంసి అధికారులు… -కొద్దిరోజుల క్రితం జీహెచ్ఎంస్ కాప్రా సర్కిల్చర్ల పల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏ ఈ ఈ) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్ ఏ ఈఈ స్వరూపను కోరారు. బిల్లులు చెల్లిం చేందుకు రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారుల ను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ యూనిట్ అధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా సదరు ఏఈఈపై గతంలో కూడా కాంట్రా క్టర్లను లంచాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. -సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో సహా యక టౌన్ ప్లానర్ బి. విఠల్ రావును సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు నికి చెందిన రెండు భవంతులకు సంబంధించిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలను అందించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు ఎనిమిది లక్ష ల రూపాయల లంచం డిమాండ్ చేసి, అందులో అప్పటికే నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నా డు. మిగిలిన నాలుగు లక్షల రూపాయల కోసం డిమాండ్ చేయడంతో సదరు భవన యజమాని ఏ సీబీకి ఫిర్యాదుదారు చేశారు. దీంతో మిగిలిన దబ్బు ఇస్తుండగా అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది. -అలాగే శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్ట బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఏసీ బీ వలకు చిక్కారు. రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

శ్రీనివాస్.. చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట సర్కిల్లో అర్బన్ బయో డైవర్సిటీ వింగ్లో రూ. 45 లక్షల మొక్కల కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ దగ్గర నుంచి శ్రీనివాస్ రూ.2,20,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.70,000 లంచం తీసుకుంటుండగా ఆయన్ని ఏ సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గాపట్టుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) దశరథ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క్వాలిటీ క్లియరెన్స్ రిపోర్టు ఇచ్చేందుకు రూ. 20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. జీహెచ్ఎంసీ డివిజన్2లో ఓకాం ట్రాక్టర్ డాక్టర్ రోడ్డు నిర్మించాడు. బిల్లుల చెల్లింపు కోసం బంజారాహిల్స్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ డీఈ ఈ దశరథ్ వద్దకు ఫైల్ వెళ్లింది. ఇందుకోసం దశరథ్.. ఆకాంట్రాక్టర్ ను రూ.30 వేల లంచం అడిగాడు. మొదటి విడతగా కాంట్రాక్టర్ వద్ద రూ.10 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే సమయంలో మిగతా డబ్బు ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు రూ.20 వేలు అందించగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ACB Raids Hyderabad Corruption in GHMC Bills Engineering Wing Bribery GHMC Corruption News Kukatpally GHMC Corruption SE Chinna Reddy Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.