రోజువారీ చక్కెర పరిమితి ఎంత ఉండాలో తెలుసుకోండి!

రోజువారీ చక్కెర పరిమితి ఎంత ఉండాలో తెలుసుకోండి

స్వీట్లు, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ లాంటి తీపి పదార్థాలు చాలా మందికి ఇష్టమే. కానీ, రోజూ ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకోవడం అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు పెరిగి, చివరకు గుండె జబ్బులకూ దారి తీస్తాయని చెబుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ప్రకారం, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజు తీసుకోవాల్సిన చక్కెర పరిమితి ఇలా ఉంటుంది

Advertisements

18 ఏళ్లు పైబడినవారు – గరిష్టంగా 50 గ్రాములు
11 నుంచి 18 ఏళ్లవారు – గరిష్టంగా 25 గ్రాములు
7 నుంచి 10 ఏళ్ల పిల్లలు – గరిష్టంగా 25 గ్రాములు
4 నుంచి 6 ఏళ్ల పిల్లలు – గరిష్టంగా 15 గ్రాములు
1 నుంచి 3 ఏళ్ల చిన్నారులు – గరిష్టంగా 12.5 గ్రాములు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు చక్కెరను పూర్తిగా తగ్గించుకోవడం మంచిది.

ఒక్కసారిగా ఎక్కువ చక్కెర తినొద్దు!

చక్కెర ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి త్వరగా పెరిగి, శరీరంపై దుష్ప్రభావం చూపిస్తుంది. వేగంగా ఇన్సులిన్ ఉత్పత్తి కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గిపోతుంది,

210719124557

పండ్లలోని చక్కెర , సాధారణ చక్కెర

పండ్లలో సహజసిద్ధంగా ఉండే చక్కెర శరీరానికి అంత హానికరం కాదు. అయితే, ప్రాసెస్ చేసిన షుగర్ (చాక్లెట్, కూల్‌డ్రింక్స్‌ లాంటి వాటిలో ఉండే షుగర్) ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది.

విషయాలను గుర్తుంచుకోండి

మనం తినే ఆహారంలో చాలా వాటిలో ఏదో ఓ రూపంలో చక్కెర పదార్థాలు ఉంటాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు.ఈ పరిమితి కన్నా తక్కువ చక్కెర తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చక్కెర పదార్థాలను వినియోగించడం మంచిదని పేర్కొంటున్నారు.ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెర పరిమితిని పాటించండి.

రోజూ తీసుకునే చక్కెరను లెక్కించడం ఎలా?

రోజూ మన ఒంట్లోకి ఎంత షుగర్ తీసుకుంటున్నామో చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.చాలా వరకు ప్యాకేజ్డ్ ఫుడ్స్ విషయంలో ప్యాకెట్లు, బాటిళ్ల మీద పోషకాల సమాచారాన్ని కంపెనీలు ముద్రిస్తుంటాయి.ప్రతి 100 గ్రాముల్లో ఎనర్జీ, ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్, షుగర్స్, ఫ్యాట్, ఫైబర్ లాంటివి ఎంత ఉంటాయో చూడొచ్చు.

సమతుల్య ఆహారం..

పండ్లు, కూరగాయలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ప్రాసెస్ చేయని ఆహారాలుంటాయి. ఇవి స్థిరమైన శక్తిని ఇస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

Related Posts
చర్మాన్ని కాపాడుకోవడానికి సరైన జీవనశైలి..
healthy skin

చర్మం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది మనకు రక్షణ కల్పించే పనిని చేస్తుంది. అలాగే మనం దానితో మన భావాలను, వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేసుకుంటాము.. Read more

శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..
food to eat in winter

శీతాకాలంలో చలితో కుంగిపోకుండా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యమైంది. చలికాలం ఉష్ణోగ్రతలు తగ్గిండంతో శరీరానికి తగినంత వేడి అందించే ఆహారం తీసుకోవాలి. Read more

మైదా వల్ల వచ్చే సమస్యలు మరియు ఆరోగ్యకరమైన మార్పులు..
maida foods

మైదా వంటలు చాలా మంది రోజూ తీసుకుంటున్నారు. ఈ మైదా పిండి నుండి తయారయ్యే వంటకాలు, పిజ్జా, బర్గర్, కేకులు, బిస్కెట్లు, మొదలైనవి చాలా రుచికరంగా ఉంటాయి.అయితే, Read more

మోమోస్ రుచిగా తయారుచేసే విధానం..
momos

మోమోస్ ఒక సులభంగా తయారయ్యే మరియు రుచికరమైన వంటకం. ఇది ఎక్కువగా తినే స్నాక్ గా ప్రాచుర్యం పొందింది. మోమోస్ ను ఇంట్లో కూడా చాలా సులభంగా Read more

Advertisements
×