High Court relief for DSC 2008 candidates

డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు ఊరట..

హైదరాబాద్‌: 2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో అర్హులైన వాళ్లతో 1,382 కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని మరోసారి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాబోదని చెప్పింది. కోడ్‌ పేరుతో నియామకాలను మళ్లీ వాయిదా వేయడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ కోడ్‌ వల్ల నియామకాల ప్రక్రియ వాయిదా పడిందంటూ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి చెప్పడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల మేరకు నియామకాలు చేసి ఈనెల 10న జరిగే విచారణ నాడు తెలియజేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో అధికారులను కోర్టుకు పిలిపించి విచారణ చేస్తామని చెప్పింది.

ఉమ్మడి ఏపీలో డీఎస్సీ-2008 నోటిఫికేషన్‌ వెలువడింది. డీఎడ్‌ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను కేటాయించారు. దీనిపై జరిగిన న్యాయపోరాటం వల్ల పలువురు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. 2009లో హైకోర్టులో దాఖలైన ఈ కేసు సుప్రీంకోర్టు నుంచి తిరిగి హైకోర్టుకు చేరింది. వాటిని సోమవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ తిరుమలాదేవి బెంచ్‌ విచారించింది. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందనీ, ఏపీ తరహాలో రిటైర్‌ అయ్యే వరకు కాంట్రాక్టు టీచర్లుగా కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి, ఈనెల 10వ తేదీలోగా పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పి విచారణను వాయిదా వేశారు.

image

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న కేసులను కొట్టేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ అయ్యాయి. గతంలో రేవంత్‌ ఎంపీగా ఉండగా నమోదైన కేసులను కొట్టేయాలని వేసిన పిటిషన్లను జస్టిస్‌ లక్ష్మణ్‌ సోమవారం విచారించారు. ఇందులో పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకు నోటీసులిచ్చారు. విచారణ ఈనెల 20కి వాయిదా వేశారు. జన్వాడలో కేటీఆర్‌ ఫాంహౌజ్‌పైన డ్రోన్‌ ద్వారా వీడియో తీశారంటూ రేవంత్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసును కొట్టేయాలని రేవంత్‌ పిటిషన్‌ వేశారు. ఇదే తరహాలో అట్రాసిటీ కేసును కూడా కొట్టేయాలని మరో పిటిషన్‌ వేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో నమోదైన కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుకు, పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2021లో ఆహార భద్రత కార్డుల పంపిణీ సభలో మాట్లాడే సమయంలో మంత్రి మైక్‌ను లాక్కున్నారంటూ రాజగోపాల్‌రెడ్డిపై కేసు దాఖలైంది. దీన్ని కొట్టేయాలంటూ రాజగోపాల్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో ప్రతివాదులైన పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Related Posts
నేడు, రేపు బీజేపీ బస్తీ నిద్ర
Today tomorrow BJP basti nidra

హైదరాబాద్‌: నేడు, రేపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర ప్రారంభించనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసి పరివాహక Read more

తెలంగాణలో ఇసుజు మోటార్స్ ఇండియా విస్తరణ
Isuzu Motors India has expanded its service footprint in Telangana

హైదరాబాద్‌: ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ యొక్క అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా తెలంగాణలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. మరియు ఈరోజు ఖమ్మంలో Read more

రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా
రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా

రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని ఒక న్యాయస్థానం రూ.200 జరిమానా విధించింది. ఈ నిర్ణయం రాహుల్ గాంధీ Read more

ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు
New ration cards for all eligible in AP soon

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. Read more