హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

telangana new highcourt wil jpg
ts-high-court

హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, హైడ్రా చర్యల కారణంగా కొందరు నిరుపేదలు సైతం రోడ్డున పడుతున్నారు.తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను ఆపివేయాలని కోర్టుకు విన్నవించారు.

జీఓ నంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించడంతో పాటు.. కూల్చివేతలకు కనీసం 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోరారు.హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని కేఏ పాల్ కోరారు.అయితే, ఇప్పటికిప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది.ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, ప్రభుత్వానికి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Us military airlifts nonessential staff from embassy in haiti.