ప్రతి మహిళా తన చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుకోవాలని కోరుకుంటుంది. అయితే మార్కెట్లో లభించే కెమికల్ ఆధారిత బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల కొన్నిసార్లు చర్మానికి హాని కలుగుతుంది. దీంతో సహజమైన, ఆయుర్వేద చికిత్సలను ప్రజలు ఎక్కువగా అనుసరిస్తున్నారు. అందులో ప్రధానమైనది మందార పువ్వు.

మందార పువ్వు ప్రయోజనాలు
1. చర్మం మృదువుగా మారుతుంది:
మందార పూలలో సహజంగా తేమను నిల్వ ఉంచే లక్షణాలు ఉన్నాయి. దీనిని రాసుకోవడం ద్వారా చర్మం డీహైడ్రేషన్‌ను ఎదుర్కొనే అవకాశం తగ్గిపోతుంది.
2. మొటిమలను తగ్గిస్తుంది:
మందార పూలలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో చర్మంపై వచ్చే మొటిమలను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
3. స్కిన్ టోన్ ను మెరుగుపరిచే శక్తి:
చర్మంపై నల్లటి మచ్చలు, గుండ్రటి గాయాలు, మలినాలను తొలగించి స్కిన్ టోన్‌ను మెరుగుపరిచే శక్తి మందార పువ్వుకు ఉంది.
4. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది:
చర్మంపై వచ్చే ముడతలను, వయసు పెరిగే సూచనలను మందార పువ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.
5. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది:
నిరంతరం వాడటం వల్ల చర్మం చల్లగా, కాంతివంతంగా ఉంటుంది.

మందార పువ్వుతో ఫేస్ ప్యాక్ తయారీ విధానం
మందార పువ్వు జెల్ ఫేస్ మాస్క్-
ఉపయోగించాల్సిన పదార్థాలు- 10 మందార పువ్వులు, అర లీటరు నీరు ఒక పాత్రలో అర లీటరు నీరు పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత అందులో మందార పూలను వేయాలి. 5-10 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీటిని వడగట్టి చల్లార్చుకోవాలి. ఆ నీటిని ఫేస్ మాస్క్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి, తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
మందార పువ్వుతో స్క్రబ్
5 మందార పువ్వులు,1 టీస్పూన్ పెరుగు, ½ టీస్పూన్ రోజ్ వాటర్ ,మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో పెరుగు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి.
మందార – అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్
2 మందార పువ్వులు, 1 టీస్పూన్ అలొవెరా జెల్ ,మందార పువ్వులను మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో అలొవెరా జెల్ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు అప్లై చేస్తే చర్మం మరింత మెరుస్తుంది. 5 మందార పువ్వులు తీసుకుని కొబ్బరి నూనెలో మరిగించి, ఆ నూనెను శిరస్సుకు అప్లై చేయాలి. దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు తేలికగా, నాజూగ్గా మారుతుంది. మందార పువ్వులను మెత్తగా చేసి గుడ్డు తెల్లసొన లేదా పెరుగు కలిపి తలకి రాయాలి.