విటమిన్లు అనగానే మనకు A, B, C, D, E, K వంటి సాధారణ విటమిన్లే గుర్తుకు వస్తాయి. అయితే చాలా మందికి తెలియని, కానీ చర్మ ఆరోగ్యానికి (Skin beauty) అసాధారణ ప్రయోజనాలు కలిగించే ఒక ప్రత్యేక పదార్థం – విటమిన్ F (Vitamin F). ఇది నిజానికి సాంప్రదాయ విటమిన్ కాకపోయినా, రెండు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను సూచించే పదం.
విటమిన్ F అంటే ఏమిటి?
విటమిన్ F అనేది ఆల్ఫాలినోలెనిక్ ఆమ్లం (ALA) మరియు లినోలెయిక్ ఆమ్లం (LA) అనే రెండు అవసరమైన కొవ్వు ఆమ్లాల సమ్మేళనం. ALA ఓ ఓమేగా-3 కొవ్వు ఆమ్లం కాగా, LA ఓ ఓమేగా-6 కొవ్వు ఆమ్లం. ఇవి మన శరీరానికి అవసరమైన విటమిన్‌లా పనిచేస్తూ, ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి (Skin beauty) ప్రధాన మద్దతు ఇస్తాయి.
చర్మ రక్షణకు విటమిన్ F
విటమిన్ F చర్మాన్ని (Vitamin F for the skin) వెలుగు మెరుగు చేసేందుకు సహాయపడుతుంది. చర్మ కణాల్లో తేమను నిలుపుతూ, బయట నుండి వచ్చే ధూళి, కాలుష్య ప్రమాదాల నుండి సంరక్షిస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా, తేమతో నిండి ఉండేలా మారుతుంది.
చర్మ అవరోధాన్ని బలోపేతం చేస్తుంది
విటమిన్ F లో ఉండే లిపిడ్లు మరియు సిరామైడ్‌ల నిర్మాణం వల్ల, చర్మంపై ఒక రక్షణ గోడలా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి తేమను తప్పించకుండా అడ్డుకుంటుంది (TEWL – Trans Epidermal Water Loss). ఫలితంగా, చర్మం ఎండిపోయే అవకాశాలు తగ్గిపోతాయి.
వాపులు, చర్మానికి ఉపశమనం
ALA, LA లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. వీటి వలన మొటిమలు, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. చర్మం లోతుల్లోని జల్లుబాటు తగ్గి, ఆరోగ్యంగా కనిపించేలా మారుతుంది.
విటమిన్ F లభించే ఆహార మూలాలు
విటమిన్ F ను మనం ఆహారం ద్వారా సహజంగా పొందవచ్చు. ముఖ్యంగా అవిసె గింజల నూనె, వాల్నట్ నూనె, గుమ్మడికాయ విత్తనాలు, కనోలా ఆయిల్ వంటి విత్తనాల నూనెల్లో ఇది సమృద్ధిగా ఉంటుంది. అలాగే సాల్మన్, మాకరెల్, ట్రౌట్, సార్డిన్స్, ట్యూనా వంటి కొవ్వు చేపలలోనూ విటమిన్ F అధికంగా లభిస్తుంది.
సౌందర్యంతో పాటు ఆరోగ్యం
విటమిన్ F తో కూడిన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా, మీరు చర్మ సమస్యల నుండి నెమ్మదిగా బయటపడవచ్చు. దీనివల్ల చర్మం తళతళలాడుతూ, సహజంగా మెరిసిపోతుంది. బ్యూటీ క్రీమ్‌లు కన్నా సహజమైన ఈ పరిష్కారాన్ని ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం.
Read hindi news: hindi.vaartha.com
Read also: Healthy Juice: ఆ టైమ్ లో ఈ జ్యూస్ లు తీసుకోండి..గొప్ప రిలీఫ్