సులభంగా మార్కెట్లో లభించే బత్తాయి లేదా మోసంబి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్‌లో విటమిన్ C(Vitamin C) అధికంగా ఉండటంతో శరీర రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. రోజుకు ఒక గ్లాస్ మోసంబి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
మోసంబి జ్యూస్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి(Vitamin C) కడుపు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు ఇది సహకరిస్తుంది. క్రమం తప్పకుండా మోసంబి జ్యూస్ తాగడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు చర్మానికి కాంతి వస్తుంది. జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడుతూ, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించేందుకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: