ఇంటి పనుల్లో(UsefulTips) చిన్నచిన్న చిట్కాలు తెలుసుకుంటే సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. వంటింటి నుంచి ఇంటి శుభ్రత వరకు ఉపయోగపడే కొన్ని చక్కని సూచనలు ఇవే.
వంటింటి పనులకు ఉపయోగపడే చిట్కాలు
- పూర్తిగా పండిన టమాటాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే(UsefulTips) చల్లటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు అవి తాజాగా కనిపిస్తాయి.
- కూరల్లో ఉల్లిపాయలు లేనప్పుడు, క్యాబేజీని సన్నగా తురిమి ఉపయోగిస్తే మంచి రుచి వస్తుంది.
- చాకులు మసకబారిపోయినట్లయితే, కొద్దిసేపు ఉప్పు కలిపిన నీటిలో ముంచి ఉంచితే మళ్లీ పదును పెరుగుతుంది.
- చీమలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో వెనిగర్ కలిపిన నీటిని చల్లి తుడిస్తే అవి దూరంగా ఉంటాయి.
- ఫ్రిజ్లో దుర్వాసన వస్తుంటే, ఒక బ్రెడ్ ముక్కను లోపల ఉంచితే ఆ వాసన తగ్గిపోతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: