థైరాయిడ్స(ThyroidCare) మస్య ఉన్నవారు మందులు తీసుకునే విధానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో మందులు తీసుకున్నప్పుడే అవి శరీరానికి పూర్తిగా పని చేస్తాయి.
థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకునే సరైన విధానం
- థైరాయిడ్ మందులను ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
- మందు తీసుకున్న తర్వాత కనీసం 45–60 నిమిషాల పాటు ఆహారం తీసుకోకుండా ఉండాలి.
- ఈ గ్యాప్ వల్ల మందు శరీరంలో మెరుగ్గా శోషించబడుతుంది.
ఏవేవి దూరంగా ఉంచాలి?
- థైరాయిడ్(ThyroidCare) మందు వేసుకున్న తర్వాత గంట పాటు యాంటాసిడ్లు, ఇతర మందులు తీసుకోకూడదు.
- ఆ సమయంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం మానుకోవాలి.
- ఇవి మందు శోషణను తగ్గించే అవకాశం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: