మన దైనందిన జీవనశైలిలో ఉప్పు కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ దీని వినియోగంలో హద్దులు దాటి పోతే, అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా బిపి, కిడ్నీ సమస్యలు (BP, kidney problems), గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చు. శరీరం మితిమీరిన ఉప్పు తీసుకున్నప్పుడు కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని గమనించి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
తరచుగా మూత్ర విసర్జన అవసరం అయితే..?
ఉప్పులో (Salt health risks) ఉండే సోడియం శరీరం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నంలో ఎక్కువగా నీటిని వినియోగిస్తుంది. దీని ఫలితంగా రోజులో అనేక సార్లు మూత్ర విసర్జన అవసరం అవుతుంది. ఇది మామూలు పరిస్థితిగా అనిపించవచ్చు కానీ దీని వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మీ శరీరంలో అధిక ఉప్పు ఉన్నదీని సంకేతం కావచ్చు.
శరీరంలోని వాపులను గమనించండి
ఉప్పు (Salt health risks) అధికంగా తీసుకునే ముఖ్యంగా కాళ్ల మడమల వద్ద వాపులు (Swelling at the heels of the feet) రావడం కనిపిస్తుంది. వేలితో ఆ భాగాన్ని నొక్కితే చర్మం లోపలికి దిగుతుంది. దీనిని వైద్యపరంగా “ఎడిమా” అంటారు. ఇది శరీరంలో నీటి నిల్వ పెరగడం వల్ల కలిగే సమస్య. ఆహారంలో ఉప్పు పరిమితంగా తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం
వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య చాలా సాధారణం. అయితే ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరం లోపల ఉన్న నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీంతో తలనొప్పి, అలసట వంటి లక్షణాలు వేగంగా కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇది శరీరంలో తటస్థ నీటిమాత్రల అసమతుల్యతకు దారి తీస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఉప్పు మోతాదును మరింత నియంత్రించడం అవసరం.
డయాబెటిస్ లేని వారు కూడా జాగ్రత్తపడాలి
డయాబెటిస్ లేకపోయినా తరచూ మూత్ర విసర్జన జరగడం, అధిక ఉప్పు తీసుకోవడం వల్లా కావచ్చు. ఇది గుండె, కిడ్నీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో ఇది మరింత ప్రమాదకరం. కాబట్టి, ఎలాంటి పరిస్థితిలోనైనా వైద్య సలహా తీసుకుని మితమైన ఉప్పు తీసుకోవడం శ్రేయస్కరం.
గుండె ఆరోగ్యాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది
సోడియం అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది గుండెపోటులకు, హృద్రోగాలకు ప్రధాన కారణంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం రోజూ 5 గ్రాములు (ఒక టీ స్పూన్) కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని సూచన. కానీ మనం సాధారణంగా ఈ పరిమితిని దాటి పోతున్నాం.
ఉప్పు లేకుండా జీవించలేము కానీ అది మితంగా ఉండాలి. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో, వృద్ధుల్లో, డయాబెటిక్ మరియు బిపి ఉన్నవారు తమ డైట్‌లో ఉప్పు మోతాదును వైద్యుల సూచనల మేరకు నియంత్రించుకోవాలి. లేదంటే ఇది తీవ్రమైన ఆరోగ్యపరమైన సమస్యలకు దారి తీసే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com