📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Rainy season: వర్ష కాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Author Icon By Sharanya
Updated: June 16, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వర్షాకాలం (Rainy season) అనేది ప్రకృతి అందాలకు వరం లాంటిదే. ఎడతెరిపి లేకుండా కురిసే చినుకులు, వర్షపు వాసన, చల్లటి గాలి మనసుకు ఓ కొత్త అనుభూతిని కలుగుతూనే ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల అనేక వైరల్, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టీ, కాఫీ పరిమితి ఉంచుకోవాలి

వర్షాకాలంలో చలిని తగ్గించుకోవడానికి చాలామంది ఎక్కువ టీ, కాఫీ తాగడం ప్రారంభిస్తారు. వీటిలో కెఫైన్ అధికంగా ఉండటం వల్ల ఇది తాత్కాలికంగా శక్తిని ఇస్తుంది కానీ దీర్ఘకాలంగా తీసుకుంటే నిద్రలేమి, అధిక ఆందోళన, హార్ట్ బీట్ పెరగడం, బీపీ పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని బదులు హెర్బల్ టీ, తులసి, అల్లం వంటి సహజ పానీయాలను తీసుకోవడం మంచిది.

వేడి నీటితో స్నానం — తగినంత జాగ్రత్త అవసరం

వర్షాకాలంలో చాలామంది వేడి నీటితో స్నానం చేయాలని కోరుకుంటారు. కానీ దీనికీ కొన్ని పరిమితులు ఉంటాయి. నీటి ఉష్ణోగ్రత 32°C నుండి 37°C మధ్యలో ఉండడం మంచిది. ఎక్కువ వేడి నీరు చర్మాన్ని ఎండబెట్టడం, ఆయిల్ బలాన్స్ తగ్గించడం, ముడతలు పడేలా చేయడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

అధిక నిద్రను నియంత్రించండి

వర్షాకాలంలో చల్లదనం వల్ల పడుకునే అలసత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువైనంత మాత్రాన ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక వ్యక్తికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుంది. దీనికంటే ఎక్కువగా పడుకోవడం శరీరంలో ఉల్లాసాన్ని తగ్గించి, అధిక బరువు సమస్యలను కలిగించవచ్చు.

నీరు తాగడం మరవొద్దు

చలిగా ఉండడం వల్ల దాహం తక్కువగా అనిపించవచ్చు. కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. రోజు కనీసం 2-3 లీటర్ల వరకు నీరు తాగడం ద్వారా మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తాయి. ప్రత్యేకంగా గోరువెచ్చని నీరు తాగితే ఇంకా మంచిది.

ఆహారం మీద శ్రద్ధ

వర్షాకాలంలో వ్యాధికారక జీవులు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం, బయట ఆహారం, ఆవిరి పట్టని పదార్థాలను ఎప్పటికీ తినకూడదు. జీర్ణశక్తిని మెరుగుపరిచే అల్లం, పెరుగు, వెల్లుల్లి, తులసి వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

డెంగ్యూ లాంటి వ్యాధులకు ముందు జాగ్రత్త

వర్షకాలంలో నిలిచిన నీరు మోశన్, డెంగ్యూ, మలేరియా వ్యాధులకు మార్గం కల్పించవచ్చు. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.

తడి దుస్తులను వెంటనే మార్చండి

వర్షంలో తడవడం వల్ల చర్మ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తడి దుస్తులను తొందరగా మార్చి, పొడిగా ఉండే దుస్తులు ధరించడం మంచిది.

వ్యాయామాన్ని మానవద్దు

వర్షాకాలం వచ్చిందని అని వ్యాయామాన్ని తగ్గించరాదు. ఇంట్లోనే లైటు యోగా, బ్రిస్క్ వాకింగ్, ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

వర్షకాలం అందంగా కనిపించినా, శరీరానికి సవాళ్లను కూడా విసురుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తగిన ఆహారం, వ్యాయామం, నిద్ర, పరిశుభ్రత అనేవి దీని కీలకమైన భాగాలు.

Read also: Baby Weight: ఏఏ వయసులో పిల్లలు ఎంత బరువు ఉండాలి?

#HealthAwareness #HealthCareInRain #ImmunityBoost #MonsoonCare #MonsoonDiseases #RainySeasonTips #StayHealthy Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.