అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక విషయంతో మీడియాలో హల్చెల్ చేస్తున్న ట్రంప్ తాజాగా గర్భిణీలు వాడే మందులపై చేసిన సూచనలపై వైద్యులు మండిపడుతున్నారు. గర్భిణీలు టైలెనాల్ (అసెటామినోఫెన్) అనే నొప్పినివారణిని అసలు వాడొద్దని ట్రంప్ సూచించారు. ఒకవేళ గర్భిణీలు ఈ మందుల్ని వాడితే పుట్టబోయే పిల్లలకు ఆటిజం వచ్చే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. అంతేకాక ఈ విషయాన్ని ఉత్పత్తిదారులు ప్రజలకు స్పష్టంగా తెలియజయడంలో విఫలమయ్యారని ట్రంప్ ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన ఓ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.
ఖండిస్తున్న నిపుణులు
అంతటితో ఆగకుండా తొందరిలోనే అమెరికా వైద్యులు ఇక టెలెనాల్ పెయిన్ కిల్లర్ను(Pain killer) సూచించరని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి రాబర్డ్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఈ విషయంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యల్ని చేయలేదు. మరోవైపు ట్రంప్ చేసిన ఈ వాదనను శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని, ఇది పూర్తిగా అసంబద్ధమైనదని వైద్య నిపుణులు ఖండిస్తున్నారు.
దీనిపై వైద్యులు ఏమంటున్నారు?
వైద్య నిపుణుల ప్రకారం..టైలెనాల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా గర్భిణీలు(Pregnant Ladies) అత్యధికంగా, సురక్షితంగా ఉపయోగించే నొప్పి నివారిణ. జ్వరం, చిన్నపాటి నొప్పుల నుంచి ఉపశమనం కోసం వైద్యులు దీన్ని సూచిస్తారు. గర్భిణీలు దీనిని వాడటం సురక్షితమని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సహా ప్రపంచంలోని అన్నీ ప్రముఖ వైద్య సంస్థలు ధృవీకరించాయి. ట్రంప్ చేసిన ఈ ఆరోపణలకు శాస్త్రీయంగా ఎలాంటి నిరూపణ లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
వైద్యులు ఎందుకు మండిపడ్డారు?
వైద్యుల ప్రకారం, ట్రంప్ వ్యాఖ్యలు శాస్త్రీయ ఆధారాలు లేని సూచనలతో కూడినవని, గర్భిణీల ఆరోగ్యానికి ప్రమాదకరమని అన్నారు.
గర్భిణీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్ల సలహా లేకుండా ఏ మందులనూ వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: