గర్భధారణ(Pregnancy Care) నెలలు ముందుకు సాగేకొద్దీ చాలా మంది మహిళల్లో నిద్రలేమి సమస్య పెరుగుతుంటుంది. శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.
Read Also: AP Govt: మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు
పూర్తి విశ్రాంతి అవసరమా?
డాక్టర్లు ప్రత్యేకంగా సూచిస్తే తప్ప అత్యధిక విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ దినచర్యను కొనసాగిస్తూ, శరీరానికి అనుకూలంగా ఉండే తేలికపాటి వ్యాయామాలు చేయడం మేలు చేస్తుంది. గర్భిణులు ఆందోళన, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సానుకూల ఆలోచనలు, ప్రశాంతమైన వాతావరణం మంచి నిద్రకు సహాయపడతాయి.
నిద్ర సమయానికి నియమాలు పాటించాలి
ప్రతిరోజూ ఒకే సమయానికి(Pregnancy Care) నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవడం శరీర గడియారాన్ని సక్రమంగా పనిచేయించడంలో సహకరిస్తుంది. అలాగే నిద్రకు ముందు మొబైల్, టీవీ వంటి గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం మంచిది. నిద్రకు ముందు చేతులు, కాళ్లు, తలపై లైట్ మసాజ్ చేసుకోవడం శరీరాన్ని రిలాక్స్ చేసి, త్వరగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: