బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండడం, కండలు పెంచుకోవడం వంటి ఆరోగ్య(Nutrition tips) లక్ష్యాలతో చాలా మంది అనేక రకాల డైట్ ప్లాన్‌లను ఫాలో అవుతున్నారు. అలాంటి వాటిల్లో ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సూచించే డైట్ ‘రెయిన్‌బో డైట్’. ఈ డైట్‌లో ముఖ్యమైన కాన్సెప్ట్ — రోజూ వివిధ రంగుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినడం. రంగులు మాత్రమే కాదు, ప్రతి రంగు ఒక్కో రకమైన పోషకాలను, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియ(Nutrition tips) మెరుగుపర్చడంలో, మానసిక ఆరోగ్యాన్ని బలపర్చడంలో రెయిన్‌బో డైట్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Health Tips: చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు
ఏ రంగు పండ్లు–కూరగాయలు ఏం చేస్తాయి?
ఎరుపు రంగు (టొమాటో, watermelon, strawberry):
గుండె ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది.
నారింజ రంగు (carrot, orange, papaya):
విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.
పసుపు రంగు (lemon, pineapple, corn):
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతం అవుతుంది.
ఆకుపచ్చ రంగు (spinach, broccoli, cucumber):
డిటాక్స్‌లో సహాయపడుతుంది. ఐరన్, కాల్షియం లభిస్తాయి.
నీలం/ఊదా రంగు (blueberries, brinjal, black grapes):
మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది. యాంటీ-ఏజింగ్ ప్రయోజనాలు ఎక్కువ.
తెలుపు రంగు (onion, garlic, mushroom):
ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి.
రెయిన్‌బో డైట్ ప్రయోజనాలు
- శరీరానికి కావలసిన అన్ని పోషకాలు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి
- ఇమ్యూనిటీ బలపడుతుంది
- జీర్ణక్రియ మెరుగవుతుంది
- చర్మం, జుట్టు ఆరోగ్యంగా మారతాయి
- బరువు తగ్గడంలో సహాయపడుతుంది
- హార్ట్ మరియు మెదడు ఆరోగ్యాన్ని బలపరుస్తుంది
- Read hindi news: hindi.vaartha.com
- Epaper : epaper.vaartha.com/