News Telugu: చాలామందికి స్మోక్ చేయడం ఒక అలవాటే కాకుండా ఒక స్టైల్ సింబల్ లాగా అనిపిస్తుంది. సిగరెట్ కాలుస్తూ పొగ రింగులు వదిలే అలవాటు యువతలో ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఆ ఒక్క క్షణం ఆనందం, తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు శారీరక ఇబ్బందులకు కారణమవుతుందనే విషయం చాలామందికి తెలియదు.
ఊపిరితిత్తులు, గుండెపై దుష్ప్రభావం
నిపుణుల ప్రకారం స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఉపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది (Lung function damaged), కాలేయం దెబ్బతింటుంది, అలాగే గుండెపోటు వచ్చే అవకాశాలు అధికం అవుతాయి. సిగరెట్‌లో ఉండే రసాయనాలు రక్తనాళాల్లో సంకోచం కలిగించి గుండెకు రక్తప్రసరణ తగ్గేలా చేస్తాయి.
టీ తాగడం – ఎప్పుడు మంచిది, ఎప్పుడు హానికరం?
సాధారణంగా టీ ఒకట్రెండు సార్లు తాగితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కానీ రోజులో ఎక్కువ సార్లు, ముఖ్యంగా పాల టీ ఎక్కువగా తాగితే గుండెపోటు (heart attack) వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిగరెట్ + టీ – ప్రమాదకర కాంబినేషన్
ఇటీవల చేసిన పలు అధ్యయనాలు చెబుతున్నట్టు, టీతో పాటు సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30% వరకు పెరుగుతాయి. టీలోని టాక్సిన్స్, సిగరెట్ పొగలోని హానికర రసాయనాలతో కలవడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది.
దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు
టీతో పాటు స్మోకింగ్ అలవాటు కొనసాగితే –
- సంతానలేమి సమస్యలు
- కడుపులో పుండ్లు
- జీర్ణ సమస్యలు
- ఉపిరితిత్తుల బలహీనత
- జ్ఞాపకశక్తి కోల్పోవడం
- బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
వంటి సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆనందం కోసం తాత్కాలికంగా చేసే అలవాట్లు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని మిగులుస్తాయి. స్మోకింగ్, టీ కాంబినేషన్ తక్షణం ఆనందం కలిగించినా, దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్‌ను పూర్తిగా మానేయడం, టీని పరిమితంగా తీసుకోవడం మాత్రమే సరైన మార్గం.
Read hindi news: hindi.vaartha.com
Read also: