News Telugu: ఖర్జూరం (Dates) పండ్లను మనం తరచుగా తింటూనే ఉంటాం. కానీ వాటిలోని గింజలు (Date Seeds) ఎక్కువ మంది చెత్తగా భావించి పడేస్తారు. అయితే తాజా పరిశోధనలు, ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం, ఖర్జూర గింజలు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్జూరం పండు కంటే కూడా దాని గింజలు రెట్టింపు ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో నిండిన ఖర్జూర గింజలు గుండె, ఎముకలు, జీర్ణక్రియ, బరువు తగ్గడం వంటి అనేక అంశాల్లో సహాయపడతాయి. ఇప్పుడు వాటి ప్రయోజనాలను ఒక్కో అంశం గా తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి ఖర్జూర గింజల మేలు
ఖర్జూర గింజల్లో ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
- రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.
- చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, రక్తనాళాల్లో అడ్డంకులు రాకుండా చేస్తాయి.
- హృదయపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా వంటి సమస్యలను నివారించడంలో సహకరిస్తాయి. దీని వలన గుండెను పదిలంగా కాపాడుకోవాలనుకునే (heart strong) వారికి ఖర్జూర గింజలు ఒక సహజ ఔషధంలా పనిచేస్తాయి.
బరువు తగ్గడంలో
బరువు తగ్గాలనుకునే వారికి ఖర్జూర గింజలు ఒక అద్భుత పరిష్కారం.
- వీటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.
- ఆకలి తగ్గించి, అనవసరమైన తినుబండారాలపై నియంత్రణ కల్పిస్తుంది.
- సిరల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గించడం వలన మెటాబాలిజం మెరుగవుతుంది. దీని వలన శరీర బరువు తగ్గడంతో పాటు హృదయ ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
జీర్ణక్రియకు మేలు, శరీర శుభ్రతకు తోడ్పాటు
ఖర్జూర విత్తనాలలో అధిక ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
- మలబద్ధకాన్ని నివారించడంలో (Preventing constipation) ఉపయోగపడుతుంది.
- కడుపులోని విషపదార్థాలను తొలగిస్తుంది.
- శరీరం డిటాక్స్ అవ్వడంలో సహాయపడుతుంది.
ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయాలనుకునే వారు ఖర్జూర గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
వ్యాయామం చేసే వారికి ప్రత్యేక మేలు
ప్రతిరోజూ వ్యాయామాలు చేసే వారికి ఖర్జూర గింజలు శక్తినిచ్చే సహజ వనరుగా మారతాయి.
- కండరాలలో వచ్చే వాపును తగ్గిస్తాయి.
- ఆక్సిడేటివ్ స్ట్రెస్ (Oxidative Stress) వలన కణజాలానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
- శరీరానికి శక్తిని అందించడంతో పాటు, కండరాలు బలపడేలా చేస్తాయి.
అందుకే ఫిట్‌నెస్ ప్రియులు ఖర్జూర గింజల పొడిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎముకలు, మూత్రపిండాలకు లాభం
ఖర్జూర గింజలు కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల సమృద్ధి మూలం.
- ఎముకలను బలంగా ఉంచుతాయి.
- ఎముకలు బలహీనపడకుండా రక్షిస్తాయి.
- మూత్రపిండాలకు మేలు చేస్తాయి, ఎందుకంటే శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో ఇవి సహాయపడతాయి.
ఖర్జూర గింజలను ఎలా తీసుకోవాలి?
ఖర్జూర గింజలను నేరుగా తినడం సాధ్యం కాదు. అందుకే వాటిని పొడి రూపంలో వాడాలి.
- కొన్ని గింజలను సేకరించి బాగా శుభ్రం చేయాలి.
- ఎండలో బాగా ఆరబెట్టాలి.
- తరువాత మీడియం మంటపై పాన్‌లో వేసి కరకరలాడేవరకు వేయించాలి.
- చల్లారిన తరువాత వాటిని ముక్కలుగా చేసి గ్రైండర్లో వేసి పొడి చేయాలి.
ఈ ఖర్జూర గింజల పొడిను
- ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో ఒక చెంచా కలిపి తాగవచ్చు.
- లేదా నీరు, తేనెతో కలిపి రోజుకు ఒకసారి తీసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read also: