పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇంగ్లాండ్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కొత్త తరహా, చౌకైన టీకాను అభివృద్ధి చేశారు. వైరస్ లాంటి కణాలు (వైరస్ -లైక్ పార్టికల్స్– విఎల్ పి) ఉపయోగించి రూపొందించిన ఈ టీకా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలకు సమానమైన లేదా అంతకంటే అధిక ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త ఆవిష్కరణ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ఈ టీకాను రూపొందించారు.
కొత్త పోలియో టీకా ప్రత్యేకతలు
కొత్త తరం పోలియో టీకా లీడ్స్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఆవిష్కృతమైంది. ఈ టీకాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని ధర కూడా చాలా చౌకగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఉంటుందని సమాచారం. వైరస్ లాంటి పార్టికల్స్(వీఎల్‌పీలు) వినియోగించుకొని ఈ టీకాను తయారు చేయడం ద్వారా సైంటిస్టులు ముందడుగు వేశారు. ఈ పార్టికల్స్ పోలియో వైరస్‌లోని అవుటర్ ప్రొటీన్ షెల్‌ను పోలి ఉంటాయి. వాటి లోపల ఏమీ ఉండదు. అంటే ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండదని అర్థం.
ప్రస్తుతం ఉన్న టీకాలతో సమానమైన ప్రభావం
ప్రస్తుతం నిశ్చేష్టీకరించిన పోలియో టీకా(ఐపివి)తో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది.
“నేచర్ కమ్యూనికేషన్స్” జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, నురుగు, కీటకాలు, క్షీరదాలు, మొక్కల సెల్స్ ద్వారా ఉత్పత్తి చేసిన విఎల్ పిలు ఉన్నతమైన రోగనిరోధక ప్రతిస్పందనను ఇచ్చాయి.
తక్కువ ఖర్చు – ఎక్కువ మందికి అందుబాటు
ఈ కొత్త టీకా ఉత్పత్తి ఖర్చు తక్కువ, అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోలియో నిర్మూలన వేగంగా కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.టీకా తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలుగుతారు, తద్వారా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది.
శాస్త్రవేత్తల అభిప్రాయాలు
ప్రొఫెసర్ నికోలా స్టోన్‌హౌస్ (లీడ్స్ యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్ )
“ఏ వ్యాక్సిన్ అయినా ఎంతో మందికి అందుబాటులో ఉంటేనే అది విజయవంతమవుతుంది.
ప్రతి చిన్నారి పోలియో బారిన పడకుండా ఉండేందుకు ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుంది.”
డాక్టర్ మార్టిన్ ఐసెన్‌హావర్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ):
“పోలియో పూర్తిగా నిర్మూలించేందుకు, ఈ కొత్త తరం టీకా చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడం గొప్ప పరిణామం.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ టీకా ప్రభావం చాలా ఉపయోగకరంగా మారుతుంది.ఈ పరిశోధన అభివృద్ధి చెందుతున్న దేశాలు పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ టీకాను తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తి చేయవచ్చని అన్నారు.