ఇన్‌స్టంట్ కాఫీ పొడిని గాలి చొరబడని డబ్బాలో వేసి డీప్‌ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే అది ఎప్పటికీ గడ్డకట్టదు. సువాసన, రుచి అలాగే ఉంటుంది.
ఆమ్లెట్ మెత్తగా(Kitchen tips) రావాలంటే కోడిగుడ్డు సొనలో కొద్దిగా నీళ్లు లేదా పాలు కలిపి బాగా గిలక్కొట్టాలి.
ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయిన స్టీల్ గిన్నెలను విడదీయాలంటే, పై గిన్నెలో(Kitchen tips) చల్లటి నీళ్లు పోసి, క్రింది గిన్నెను వేడినీటిలో ఉంచితే వెంటనే వదులుకుంటాయి.
పాస్తా ముద్దలా కాకుండా ఉండాలంటే ఉడికించే సమయంలో చెక్క స్పూన్ లేదా ఫోర్క్ వేసి ఉంచాలి. ఇది పొంగిపోవడాన్ని కూడా నిరోధిస్తుంది.
బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలంటే కొన్ని నిమ్మ తొక్కలు లేదా ఒక స్పూన్ ఉప్పు వేయండి.
ఉల్లిపాయలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టి, గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి.
కొత్తిమీర త్వరగా ఎండిపోకుండా ఉండాలంటే, బట్టలో కట్టి ఫ్రిజ్‌లో ఉంచండి.
తవ్వా మీద దోశలు అంటుకుంటే, కొద్దిగా ఉల్లి ముక్కను తవ్వా మీద రుద్దితే బయటి పొర తగ్గి దోశ బాగా వస్తుంది.
నిమ్మరసం త్వరగా వచ్చేందుకు, నిమ్మకాయలను 10–15 సెకన్లు మైక్రోవేవ్‌లో వేడి చెయ్యండి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: