మూత్రాన్ని తరచూ ఎక్కువసేపు ఆపుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కిడ్నీ(Kidney health) రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, అలాగే మొత్తం మూత్ర వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
బలవంతంగా మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు
మూత్రాన్ని బలవంతంగా(Kidney health) ఆపుకోవడం వల్ల పైలోనెఫ్రిటిస్ (Pyelonephritis) అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కిడ్నీలను ప్రభావితం చేసే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయకపోతే, మూత్రపిండాలకు శాశ్వత నష్టం కలిగే అవకాశముంది.
సాధారణంగా మూత్రాశయంలో ఉన్న బ్యాక్టీరియా పైకి వెళ్లి మూత్రపిండాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మూత్ర విసర్జనకు శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరం వచ్చిన వెంటనే స్పందించడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: