సాధారణంగా శరీరంలో థైరాక్సిన్ హార్మోన్(Hormonal Imbalance) స్థాయులు తగ్గినప్పుడు, ప్రొలాక్టిన్ హార్మోన్ మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండం సక్రమంగా విడుదల కాకపోవడం జరుగుతుంది. ఫలితంగా మహిళలకు గర్భం దాల్చడం కష్టమవుతుంది.
అలాగే థైరాయిడ్(Hormonal Imbalance) సమస్యల వల్ల నెలసరి క్రమం తప్పడం (ఇర్రెగ్యులర్ పీరియడ్స్) సంతానలేమికి దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి, డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే గర్భధారణ సాధ్యమే.
గర్భం దాల్చిన తరువాత కూడా వైద్యుల సలహా మేరకు అవసరమైన మందులు, చికిత్సను కొనసాగించడం ఎంతో ముఖ్యం. ఇలా చేస్తే తల్లి, శిశువుల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ ఉన్న మహిళలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: