News Telugu: HIV: ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

Read Time:  1 min
News Telugu: HIV: ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!
FONT SIZE
GET APP

వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ : హెచ్ఐవీ (HIV) నియంత్రణ, బాధితులకు వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, దేశంలోనే తొలిసారి ప్రథమ ర్యాంకు సాధించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరుతో పోలిస్తే రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో నిర్దేశించిన ఇండికేటర్లలో అద్భుతమైన పనితీరు కనబరిచి, మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని ప్రకటించారు.

Read also: Pecan Nuts : పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

ఎయిడ్స్ నియంత్రణ సంస్థ

33 ఇండికేటర్ల (పనితీరు సూచికలు)కు కేటాయించిన 138కి 105 మార్కులను ఏపీ సాధించిందని చెప్పారు. న్యాక్ (నేషనల్ కంట్రోల్ ఆర్గనైజేషన్) విడుదల చేసిన అర్థ సంవత్సర వార్షిక నివేదికలో పేర్కొన్న ర్యాంకింగ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు ముందుందని వెల్లడించారు. ఇదే ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పనితీరు ప్రతిపాదికన న్యాక్ విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో ఏపీ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దీనిని అధిగమిస్తూ తొలి స్థానంలో నిలిచేలా పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, ఉద్యోగులను మంత్రి సత్యకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.