ప్రతిరోజూ ఉదయం 8 గంటలకల్లా అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి(HealthTips) ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిర్ణీత సమయానికి ఆహారం తీసుకుంటే శరీరంలోని జీవక్రియ వ్యవస్థ మెరుగుపడి, బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.
అలాగే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ సరైన సమయంలో అందడంతో శక్తి స్థాయులు పెరిగి రోజంతా చురుకుగా ఉండగలుగుతారు. సమయానికి అల్పాహారం తీసుకునే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార(HealthTips) పదార్థాలను అల్పాహారంగా తీసుకోవడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు. అల్పాహారాన్ని ఆలస్యంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: