Health News: భారతదేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కుంగుబాటు (Depression), ఆందోళన (Anxiety) వంటి సమస్యలు మహిళా లోకాన్ని పట్టిపీడిస్తున్నాయి.
Read Also : Kitchen Tips: అరటి తొక్కతో ఇంటి పనులకు అద్భుత ప్రయోజనాలు
నివేదికలోని కీలక ముఖ్యాంశాలు:
- డిప్రెషన్: దాదాపు 40% మంది మహిళలు తీవ్రమైన కుంగుబాటుతో సతమతమవుతున్నారు.
- నిద్రలేమి: సుమారు 47% మంది మహిళలు సరైన నిద్ర లేక అనారోగ్యానికి గురవుతున్నారు.
- కెరీర్ వివక్ష: వృత్తిపరంగా ఎదుగుదల విషయంలో 80% మంది మహిళలు ఏదో ఒక దశలో వివక్షను ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.
- కార్పొరేట్ రంగం: ఆఫీసుల్లో పని చేసే మహిళల్లో 42% మంది మానసిక ఆందోళన లక్షణాలతో బాధపడుతున్నారు.
పెరుగుతున్న రుగ్మతలు:
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక ప్రకారం మహిళల్లో వివిధ మానసిక రుగ్మతలు ఈ స్థాయిలో పెరిగాయి:
- ఆహార సంబంధిత సమస్యలు: 63.3% పెరుగుదల.
- నిరాశ, నిస్పృహలు: 29.8% పెరుగుదల.
- ఆందోళన రుగ్మతలు: 27.9% పెరుగుదల.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :