News Telugu: Health: పెరుగుతున్న ఊబకాయం..

Read Time:  1 min
Health: Increasing obesity
Health: Increasing obesity
FONT SIZE
GET APP

ప్రతి నలుగురిలో ఒకరికి ఊబకాయం… (obesity) వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదం
మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో జీవనం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాల వాడకం కారణంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల్లో కూడా ఊబకాయం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read also: Hemp Seeds: హెంప్ సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు

Health: Increasing obesity

Health: Increasing obesity

సర్వే ఏమి చెబుతోంది?

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం గ్రామాల కంటే పట్టణాల్లో ఊబకాయం ఎక్కువ. కరోనా సమయంలో ఇంటికే పరిమితమై అధిక కాలరీల ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగింది. నియంత్రణ లేకుండా తీసుకునే పిండి, ఫ్యాట్ ఉన్న ఆహారాలే ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు.

ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు

ఉబ్బసం, మధుమేహం, రక్తపోటు, హృద్రోగం, ఫ్యాటీ లివర్, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం అధికం. కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతాయి.

బరువు తగ్గే సులభ మార్గాలు
• రోజూ వేగంగా నడవడం
• యోగా, లైట్ ఎక్సర్‌సైజ్ చేయడం
• జంక్ ఫుడ్ తగ్గించడం
• సమయానికి సమతుల ఆహారం తీసుకోవడం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.