యాలకులు లేక ఇలాచీలు వంటల్లో సుగంధాన్ని కలిగించేందుకు మాత్రమే ఉపయోగించబడేవి అనుకునే వారు చాలామందే ఉన్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల అభిప్రాయం. పలు ఔషధ గుణాలను కలిగిన ఈ మసాలా పదార్థం మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు అద్భుత సహాయం
భోజనం తర్వాత యాలకులు (Elaichi Benefits) నమలడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం (Indigestion, bloating), గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. యాలకుల్లో ఉండే సహజ నూనెలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఆమ్లత, అసిడిటీ వంటి ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడతాయి.
నోటి ఆరోగ్యానికి రక్షణ కవచం
యాలకులను నమలడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా పెరగకుండా నివారించవచ్చు. ఇది దుర్వాసనను తగ్గించడమే కాకుండా, నోటి శుభ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే నోటి పూళ్ళు, ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.
మూత్రపిండాల ఆరోగ్యానికి బలం
యాలకులు (Elaichi Benefits )శరీరంలోని విషతత్వాలను (Toxins) తొలగించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, శరీర శుద్ధిని వేగవంతం చేస్తాయి. దీని వల్ల శరీరానికి చక్కటి శుభ్రత లభిస్తుంది.
రక్తపోటు నియంత్రణ – గుండెకు రక్షణ
యాలకుల్లో ఉండే సమతుల్య పోషక విలువలు రక్తపోటును సమతుల్యంలో ఉంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి ఇది సహజ పరిష్కారం.
మానసిక ఒత్తిడికి ఉపశమనం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, యాలకులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రిపూట భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల మెరుగైన నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల శరీరమంతా విశ్రాంతి పొందుతుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందించే శక్తివంతమైనది
యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో రోగ నిరోధక శక్తి అవసరమైన సందర్భాల్లో యాలకులు ఉపయుక్తంగా ఉంటాయి.
జ్ఞాపకశక్తి మెరుగుదల
యాలకులు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది విద్యార్థులు, పెద్దలెవరికైనా ఉపయోగపడే సమాచారం.
క్యాన్సర్ నిరోధనలో కీలక పాత్ర
యాలకుల్లో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కారకమైన సెల్స్‌ను ఎదగకుండా నిరోధించగలవని కొన్నీ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది యాలకులను ఒక ప్రాకృతిక రక్షణకవచంగా నిలబెడుతుంది.
సౌందర్యానికి సహజ మిత్రుడు
యాలకుల్లో ఉండే విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, మరియు ముఖ్యమైన నూనెలు జుట్టును మెరిసేలా చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించి, ముడతలు, మొటిమలు వంటి సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తాయి. ఇది యాలకులను ఆరోగ్యంతో పాటు సౌందర్యానికి కూడా ఉపయోగకరంగా మారుస్తుంది.
రోజూ యాలకులు తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
- అజీర్తి, గ్యాస్ తగ్గుతుంది
- నోటి దుర్వాసన తొలగుతుంది
- రక్తపోటు నియంత్రణ
- ఒత్తిడి తగ్గి నిద్ర మెరుగవుతుంది
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటాయి
యాలకులు జీర్ణక్రియలో ఎలా సహాయపడతాయి?
యాలకుల్లో ఉండే నూనెలు అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి భోజనం తరువాత నమలడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com