బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడం అనేది చాలా మందికి ఒక సవాలుగా మారుతోంది. అయితే, మన కిచెన్‌లోనే దాని పరిష్కారం దొరుకుతుంది – అదే గుడ్డు. సులభంగా లభించే ఈ ఆహార పదార్థం, సరైన విధంగా తీసుకుంటే బరువు తగ్గేందుకు గొప్ప మద్దతుగా మారుతుంది.
ప్రోటీన్‌తో ఆకలిని అదుపులో పెట్టే శక్తి
గుడ్డు అనేది ప్రోటీన్‌లో పుష్కలంగా ఉన్న ఆహారం. ఒక పెద్ద గుడ్డులో సుమారు 6 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే పొట్ట నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. ఇది మధ్యం భోజనాల మధ్య జంక్ ఫుడ్ తినాలనే ఆలోచనను తగ్గిస్తుంది. దీని వల్ల రోజులో తీసుకునే మొత్తం కేలరీలు తగ్గిపోయి బరువు తగ్గడం సులభమవుతుంది.
తక్కువ కేలరీలతో అధిక పోషకాలు
ఒక గుడ్డులో కేవలం 70 కేలరీలు మాత్రమే ఉంటాయి. అయితే అందులో విటమిన్ D(Vitamin D), విటమిన్ B12, ఐరన్ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మెటబాలిజంను మెరుగుపరచి, శక్తిని నిలబెట్టేందుకు సహాయపడతాయి. దీంతో డైటింగ్ సమయంలో వచ్చే అలసట లేదా నీరసం తగ్గుతుంది.
గుడ్డును ఎలా తీసుకోవాలి?
బరువు తగ్గాలనుకునే (Want to lose weight)వారు గుడ్డును ఉడకబెట్టిన రూపంలో తీసుకోవడం ఉత్తమం. వేయించిన గుడ్లు లేదా ఎక్కువ నూనె ఉపయోగించే ఆమ్లెట్లకు దూరంగా ఉండాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్డులు తీసుకుంటే, రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే, కూరగాయల సలాడ్‌లో ఉడికిన గుడ్డు ముక్కలు కలిపితే మంచి పోషక విలువ లభిస్తుంది.
కొలెస్ట్రాల్ గురించి అపోహల్ని వీడండి
చాలామందిలో గుడ్డు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయం ఉంటుంది. కానీ తాజా పరిశోధనల ప్రకారం, మితంగా గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పై పెద్దగా ప్రభావం చూపదు. అందుకే, దైనందిన ఆహారంలో గుడ్లను చేర్చుకోవడంలో ఎలాంటి భయం అవసరం లేదు.
బరువు తగ్గాలనుకునే వారు గుడ్లు తినవచ్చా?
అవును, గుడ్లు ప్రోటీన్ ఎక్కువగా ఉండే తక్కువ కేలరీల ఆహారంగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ఆకలిని అదుపులో ఉంచి, అనవసరమైన తినుబండారాలపై ఆధారపడకుండా చేస్తాయి.
గుడ్లలో బరువు తగ్గడానికి ఏ పోషకాలు సహాయపడతాయి?
గుడ్లలో అధికంగా ఉండే ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, మరియు విటమిన్ D వంటి పోషకాలు శరీర జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి శక్తిని పెంచి, క్యాలొరీలను త్వరగా ఖర్చు చేయడానికి తోడ్పడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: