పెరుగు భారతీయ ఆహారంలో ఓ అపరివార్యమైన భాగం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, శరీరానికి శక్తినిచ్చే విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది. కానీ, పెరుగును రాత్రి వేళల్లో తినడం ఎంతవరకు మంచిదో అనేదాని గురించి చాలామందిలో సందేహం ఉంది. ఆయుర్వేద నిపుణులు, ఆహార నిపుణులు దీనిపై కొన్ని కీలక సూచనలు అందిస్తున్నారు.
రాత్రి పెరుగు తింటే శరీరం చల్లబడుతుంది
ఆయుర్వేదం ప్రకారం, పెరుగు శీతల స్వభావం కలిగిన ఆహారం. రాత్రివేళ మన శరీరం సహజంగా మందగత జీవక్రియ స్థితిలో ఉంటుంది. అలాంటి సమయంలో చల్లదనాన్ని కలిగించే పెరుగు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం
రాత్రిపూట పెరుగు తీసుకుంటే కఫం అధికం అవుతుంది. దీని ప్రభావంగా ఉదయం గొంతు బిగుసుకుపోవడం, ముక్కు దిబ్బడ, దగ్గు, జలుబు వంటి సమస్యలు (Problems like colds) తలెత్తవచ్చు. దీన్ని ఆస్థమా, బ్రాంకైటిస్ వంటి రోగాలు ఉన్నవారు తీవ్రంగా అనుభవించవచ్చు.
జీర్ణ సమస్యలకు అవకాశం
రాత్రిపూట పెరుగు తినడం వల్ల గ్యాస్, , ఎసిడిటీ (Acidity)వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శీతల ఆహారాన్ని రాత్రి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. ఇది క్రమంగా అజీర్ణం, వాంతులు, లేదా అల్పాహారం కోరిక లేకపోవడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది.
చర్మ సమస్యలు, అలెర్జీలు
కొంతమందిలో రాత్రిపూట పెరుగు తీసుకున్న తర్వాత చర్మం పై మొటిమలు, అలెర్జీ, దురద వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది పెరుగులోని తేమ శరీరంలో నిలిచిపోవడం వల్ల కలిగే ప్రభావం కావచ్చు. కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కీళ్ల నొప్పులకు పెరిగిన ప్రమాదం
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల వాతం (వాత దోషం) అధికమవుతుంది. దీని ప్రభావంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువవుతాయి. ఇప్పటికే జాయింట్ సమస్యలతో బాధపడే వారు పెరుగు తీసుకోవడం వల్ల వారి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పెరుగు చాలా ఆరోగ్యకరమైన ఆహారం అయినా, దానిని తినడానికి సరైన సమయం అవసరం. మధ్యాహ్న భోజనంతోపాటు పెరుగు తీసుకోవడం ఉత్తమం. రాత్రిపూట తప్పనిసరిగా తినాలనుకుంటే, తీపి మజ్జిగ లేదా చిన్న మోతాదులో చక్కెర కలిపిన పెరుగు తీసుకోవచ్చు – అయితే ఇది కూడా వైద్యుల సలహాతోనే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: