Beauty tips: పెర్ఫ్యూమ్ సువాసన ఎక్కువసేపు నిలవాలంటే కేవలం ఉత్పత్తి నాణ్యత మాత్రమే కాదు, దాన్ని ఎలా అప్లై చేస్తున్నామన్నదీ కీలకమని స్టైలిష్ట్ టీనా వాలియా చెప్పారు. చెవుల వెనుక భాగం, కాలర్ బోన్, మణికట్టులు, మోచేయి లోపలి భాగం, మోకాళ్ల వెనుక వంటి పల్స్ పాయింట్లపై పెర్ఫ్యూమ్(Perfume) స్ప్రే చేస్తే సువాసన బాగా నిలుస్తుందని ఆమె సూచించారు.
Read Also: Health Tips: పైనాపిల్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు
పెర్ఫ్యూమ్ అప్లై చేసే సరైన పద్ధతి
అయితే మణికట్టుపై పెర్ఫ్యూమ్‌ను రుద్దకూడదని, అలా చేస్తే ఫ్రాగ్రెన్స్ మాలిక్యూల్స్ దెబ్బతిని వాసన త్వరగా తగ్గిపోతుందని వివరించారు. స్నానం చేసిన వెంటనే, చర్మం తేమగా ఉన్న సమయంలో పెర్ఫ్యూమ్ అప్లై చేస్తే సువాసన ఎక్కువసేపు నిలిచిపోతుందని తెలిపారు. అవసరమైతే బట్టలపై కూడా తక్కువ మోతాదులో స్ప్రే చేసుకోవచ్చని, అలాగే పెర్ఫ్యూమ్ బాటిళ్లను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమమని సూచించారు.
చర్మ స్వభావాన్ని బట్టి పెర్ఫ్యూమ్ ఎంపిక ఎలా?
అదేవిధంగా, పెర్ఫ్యూమ్ ఎంచుకునేటప్పుడు మీ చర్మ స్వభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పొడి చర్మంతో పోలిస్తే ఆయిల్ ఉన్న చర్మంపై సువాసన ఎక్కువసేపు నిలుస్తుంది. అందువల్ల డ్రై స్కిన్ ఉన్నవారు ముందుగా తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత పెర్ఫ్యూమ్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే, ఒకే సమయంలో ఎక్కువ సువాసనలను కలపకుండా ఒకే ఫ్రాగ్రెన్స్‌ను ఉపయోగించడం వల్ల వాసన స్పష్టంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: