ఉదయం లేవగానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యాన్ని శారీరకంగా, మానసికంగా దెబ్బతీయగలవని నిపుణులు చెబుతున్నారు. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండాలంటే ఉదయం మొదటి గంట అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం నిద్ర స్థితి నుంచి సజీవ స్థితికి మారుతుంది. కాబట్టి అప్పుడు తీసుకునే నిర్ణయాలు, అలవాట్లు మన దినచర్యపై భారీగా ప్రభావం చూపుతాయి. మరి అలాంటి పొరపాట్లు ఏమిటో, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
పొరపాట్లు ఎలా నివారించడం
వెల్లకిలా లేచడం కాదు – కుడిపక్కకు తిరిగి లేవండి
కొంతమంది నిద్రలేచిన వెంటనే (After Wake Up) వెల్లకిలా పడుకున్న స్థితిలో నేరుగా కూర్చొంటారు. కానీ రాత్రంతా శరీరం నిశ్చలంగా ఉండడం వల్ల కండరాలు గట్టి పోతాయి. వెంటనే లేచి కూర్చోవడం వల్ల గట్టి కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. నిపుణుల ప్రకారం, ముందుగా కుడి వైపు తిప్పుకుని, నెమ్మదిగా పక్కకు తిరిగి లేచే అలవాటు వేసుకోవాలి. ఇలా చేస్తే శరీర భాగాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది.
ఉదయాన్నే హడావిడి వద్దు – ముందుగానే ప్లాన్ చేసుకోండి
ఉదయం వేళ, హడావుడిగా పని చేయడం మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. కొన్ని పనులు — ఉదాహరణకు డ్రెస్సులు సిద్ధం చేయడం, లంచ్ బాక్స్‌కి కావాల్సిన కూరగాయలు తరుక్కోవడం వంటి పనులను ముందుగానే రాత్రే చేసుకుంటే, ఉదయం ప్రశాంతంగా గడుస్తుంది. ఈ అలవాటు మన డేను ఫోకస్‌తో ప్రారంభించేందుకు సహాయపడుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ మానకండి – ఆరోగ్యానికి తీవ్ర నష్టం
ఉదయం అల్పాహారం మానడం చాలా మంది చేసే పెద్ద పొరపాటు. బ్రేక్‌ఫాస్ట్ మానడం వల్ల శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. దీని వల్ల ఎనర్జీ తగ్గిపోతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీర బరువు పెరగడం, ఇన్‌సులిన్‌కు రెసిస్టెన్స్ పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. అల్పాహారం అనేది ఆ రోజు శక్తిని అందించే మొదటి ఆహారం. దీన్ని ఎప్పుడూ మానకండి.
లేవగానే మొబైల్‌లో పట్టుకోవద్దు
ఉదయం లేవగానే (After Wake Up) ఫోన్ తీసుకుని నోటిఫికేషన్లు చెక్ చేయడం, మెసేజెస్ చూడడం, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం మానవీయ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నెగెటివ్ వార్తలు కనిపించినప్పుడు డే మొత్తం దాని ప్రభావంతో నడుస్తుంది. కాబట్టి లేవగానే కనీసం 30 నిమిషాలపాటు మొబైల్ దూరంగా ఉంచడం మంచిది. దానికంటే బదులుగా పుస్తకం చదవడం, మైండ్‌ఫుల్ బ్రతుకును ప్రారంభించడానికి చాలా ఉపయోగపడుతుంది.
వార్మప్ లేకుండా వ్యాయామం వద్దు
ఉదయం వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ నిద్రలేచిన వెంటనే కఠినమైన జిమ్ వర్కౌట్స్ చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరం బిగుసుగా ఉంటుంది, కండరాలు సడలిపోలేకపోతాయి. ఇది గాయాలకు దారి తీస్తుంది. కాబట్టి ముందుగా 5–10 నిమిషాలు వార్మప్ చేయడం, స్లో స్ట్రెచింగ్, యోగా చేయడం ద్వారా శరీరాన్ని మెల్లగా మేల్కొల్పాలి. ఆపై ప్రామాణిక వ్యాయామం చేయవచ్చు.
Read also: High cholesterol: అధిక కొలెస్ట్రాల్ ఇచ్చే ముప్పులు