“20-20-20” నిబంధనతో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Read Time:  1 min
eye care
eye care
FONT SIZE
GET APP

ప్రపంచంలో ఎక్కువమంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు మరియు ఇతర డిజిటల్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఇవి మన దృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి దీని వల్ల కళ్ళలో అలసట, దృష్టి తగ్గడం వంటి సమస్యలు కలగవచ్చు.ఈ సమస్యల నుండి రక్షించుకోవడానికి “20-20-20” నిబంధనను పాటించడం చాలా ముఖ్యం.

“20-20-20” నిబంధన ప్రకారం, మీరు 20 నిమిషాలు డిజిటల్ పరికరాలు ఉపయోగించిన తరువాత, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువు లేదా ప్రకృతిని 20 సెకన్ల పాటు చూస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఈ సరళమైన పద్ధతితో మనం కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కళ్లకు విశ్రాంతి ఇవ్వడమే కాకుండా, కొన్నిసార్లు కళ్లకు కావలసిన పోషకాలు కూడా అవసరం.వీటిని పుష్కలంగా అందించే ఆహారాలు మన ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం.

కళ్ల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు విటమిన్ A, C, E, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. కూరగాయలు కళ్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. బాదం ఇందులో విటమిన్ E ఉండి, కళ్లను ఆక్సిడేటివ్ డ్యామేజి నుండి రక్షిస్తుంది. సిట్రస్ ఫలాలు, ఆరెంజ్, లెమన్ వంటి ఫలాలు విటమిన్ C తో పుష్కలంగా ఉండి, కళ్లలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చడం ద్వారా కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక, “20-20-20” నిబంధనను పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం మరియు కళ్లకు అవసరమైన విశ్రాంతి ఇవ్వడం ద్వారా మనం కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

pragathi doma

రచయిత గురించి

pragathi doma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.