అట్ల తద్ది: స్త్రీలకు ప్రత్యేకమైన పండుగ

Read Time:  1 min
atla taddi 2021
atla taddi 2021
FONT SIZE
GET APP

అట్ల తద్ది స్త్రీలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇదీ ఒకటి. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.

పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని ఈ వ్రతం చేస్తారు . పెళ్లయిన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఈ నోము జరుపుకుంటారు.
పండుగనాడు ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని పీల్చుతారు. ఉపవాసంతో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. మహిళలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందిస్తుంది.

అట్లతద్ది పండుగలో అట్లదే ప్రత్యేకత. మినప్పిండి, బియ్యప్పిండి కలిపి అట్లు వేస్తారు. అట్లతద్ది పండుగకు ముందు భోగినాడే తలస్నానం చేసి గోరింటాకు పెట్టుకోవడం, పండుగ తెల్లవారుజామున ఇరుగుపొరుగు ముత్తైదువులను ఆహ్వానించడం ఆనందంగా ఉంటుంది. పండుగనాడు తెల్లవారుఝామున చేసే భోజనాలు, విందు వినోదాలు ఆనందంగా ఉంటాయి.

pragathi doma

రచయిత గురించి

pragathi doma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.