ప్రస్తుత జీవనశైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో పీసీఓఎస్ (PCOS) ఒకటి. అయితే ఇది ఒక్క(Women health) రకంగా కాకుండా, లక్షణాల ఆధారంగా నాలుగు విభాగాలుగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని A, B, C, D టైపులుగా గుర్తించారు.
A టైప్ PCOS ఉన్నవారిలో మగ హార్మోన్లు(Women health) అధికంగా ఉండటం, అండం విడుదల కాకపోవడం, అలాగే అండాశయాల్లో తిత్తులు కనిపించడం ప్రధాన లక్షణాలు.
B టైప్‌లో కూడా మగ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో నెలసరి సక్రమంగా లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది.
C టైప్ PCOSలో మగ హార్మోన్లు పెరగడం, అండాశయాల్లో తిత్తులు ఉండడం కనిపించినప్పటికీ, నెలసరి సాధారణంగానే జరుగుతుంది.
D టైప్‌లో అండాశయాల్లో తిత్తులు ఉండి, నెలసరి రాకపోవచ్చు. అయితే ఈ రకంలో మగ హార్మోన్ల స్థాయి సాధారణంగానే ఉంటుంది.
ఈ నాలుగు రకాల పీసీఓఎస్‌లో ప్రతి ఒక్కదానికి లక్షణాలు భిన్నంగా ఉండటంతో, సరైన నిర్ధారణతో పాటు తగిన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: