చక్కెరను మానేసిన తర్వాత శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడం తగ్గినా, కొద్ది రోజుల్లోనే ఎనర్జీ లెవల్స్ స్థిరంగా మారుతాయి. చక్కెర వల్ల వచ్చే అకస్మాత్తు అలసట,(Weight Loss) మూడ్ స్వింగ్స్ క్రమంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Health: రోజువారీ ఆహారంలో చిలగడదుంప ఉంటే అనారోగ్యాలకు చెక్
మానసిక స్పష్టత, నిద్రలో మెరుగుదల
అధిక చక్కెర తీసుకోవడం వల్ల కలిగే మానసిక అస్పష్టత తగ్గి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుందని(Weight Loss) వైద్యులు పేర్కొంటున్నారు. రాత్రివేళ చక్కెర కోరికలు తగ్గడం వల్ల లోతైన నిద్ర సాధ్యమవుతుందని అంటున్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గింపు
చక్కెర వినియోగం తగ్గించడం ద్వారా టైప్–2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచి పెట్టుబడిగా భావించవచ్చని అంటున్నారు. చక్కెర మానేసే సమయంలో పండ్లు, డ్రైఫ్రూట్స్‌ను పరిమితంగా తీసుకోవడం, తేనె వంటి సహజ స్వీటెనర్లను తక్కువ మోతాదులో వినియోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తగినంత నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: