ఆరోగ్యంగా ఉండాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని మనకు తెలుసు. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకుంటే అనేక దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయంటున్నారు. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు రోజూ మందులు వాడుతుంటారు. అయితే.. వీరు తగినంత నీరు (Water)తాగడం అలవాటు చేసుకుంటే.. హైబీపీ కూడా అదుపులోకి వస్తుందంటున్నారు నిపుణులు. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్, లో,గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉండటానికీ అధిక రక్తపోటు, గుండె వైఫల్యం ముప్పులు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇజ్రాయెల్‌లోని బార్-ఇలాన్ యూనివర్సిటీ నిర్ధారించింది. సుమారు నాలుగు లక్షల మంది మీద చేసిన పరిశోధనలో తగినంత నీరు (Water)తాగితే సహజంగానే శరీరంలో సోడియం సాంద్రత తగ్గుతుందని వారు గుర్తించారు. దీన్ని చిన్న విషయంగా భావించవద్దని, ఇది దీర్ఘకాల గుండెజబ్బుల నివారణకు ఉత్తమ మార్గమని చెబుతున్నారు.
Read Also : http://Andhra pradesh: ఇక పై వీటికి ఉచితంగా చికిత్సలు
రక్తంలో సోడియం మోతాదులు 135 నుంచి 146 ఎంఎంఓఎల్/ఎల్ ఉండటం నార్మల్‌గా భావిస్తారు. అయితే..సోడియం మోతాదులు 140 నుంచి 146 ఎంఎంఓఎల్/ఎల్ ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్/ఎల్ కన్నా మించితే.. హైబీపీ రిస్క్ 29%, గుండె వైఫల్యం ముప్పు 20% పెరుగుతున్నట్టు వారు నిర్ధారించారు. ఈక్రమంలో ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా కీలకమని ఈ పరిశోధన తెలియజేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ఆయా వ్యక్తుల ఆరోగ్యం, చేసే పనులు, వాతావరణాన్ని బట్టి నీటి అవసరం మారుతుందని వెల్లడించారు. ఇది అవగాహన మాత్రమే. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :