చారిత్రక నగరం వరంగల్ ఇప్పుడు ‘ఫుడ్ క్యాపిటల్’గా మారుతోంది. 2025 సంవత్సరానికి సంబంధించి స్విగ్గీ విడుదల చేసిన గణాంకాలు నగరం యొక్క మారుతున్న ఆహార అభిరుచులను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది వరంగల్ వాసులు ఏకంగా 4.46 లక్షల చికెన్ బిర్యానీ ప్లేట్లను ఆర్డర్ చేసి, తమ బిర్యానీ ప్రేమిని చాటుకున్నారు. అంటే సగటున రోజుకు 1222 ప్లేట్ల బిర్యానీ వరంగల్ వీధుల్లో డెలివరీ అయ్యింది. కేవలం మధ్యాహ్న భోజనమే కాకుండా, అర్థరాత్రి వేళల్లో కూడా బిర్యానీ మరియు షావర్మా కోసం ఆర్డర్లు 118 శాతం పెరగడం గమనార్హం. ఓ కస్టమర్ ఏకంగా రూ. 13,778 విలువైన 37 ప్లేట్ల విభిన్న వంటకాలను ఒకే ఆర్డర్‌లో తెప్పించుకుని నగర రికార్డు సృష్టించారు.
TG: కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
నగరంలో ఉదయపు వేళలు ‘క్లాసిక్’ రుచులతో కళకళలాడుతున్నాయి. వరంగల్ వాసులకు అత్యంత ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ వంటకంగా ఇడ్లీ నిలిచింది. ప్రతి రోజూ ఉదయం సగటున 200 ప్లేట్లకు పైగా ఇడ్లీ ఆర్డర్లు నమోదయ్యాయి. దీనితో పాటు వెజ్ దోస, వడ, బోండాలు నగరవాసుల ఉదయపు ఆకలిని తీరుస్తున్నాయి. స్నాక్ టైమ్ (మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 వరకు) లో కూడా చికెన్ బిర్యానీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, బర్గర్లు మరియు పిజ్జాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సరసమైన ధరల విభాగంలో (99 స్టోర్) కూడా చికెన్ బిర్యానీ, చికెన్ నగ్గెట్స్ వంటి వంటకాలకు భారీ ఆదరణ లభించింది.
ఈ ధోరణిని విశ్లేషిస్తూ స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భాకూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వరంగల్‌లో సాంప్రదాయ రుచులకు (ఇడ్లీ, దోస) మరియు ఆధునిక ఫాస్ట్ ఫుడ్ (బర్గర్, షావర్మా) కు మధ్య ఒక అద్భుతమైన సమతుల్యత ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆహారం కోసమే కాకుండా, వేడుకల్లో భాగంగా కూడా స్విగ్గీ సేవలను వినియోగించుకోవడం ఒక జీవనశైలిగా మారిపోయింది. డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ కేకులు డెజర్ట్ విభాగంలో అగ్రస్థానంలో నిలవడం చూస్తుంటే, వరంగల్ వాసులు విందును తీపి జ్ఞాపకాలతో ముగించడానికి ఇష్టపడుతున్నారని అర్థమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com