ఒక్కసారిగా బరువు పెరగడం లేదా తగ్గడం, తరచుగా జలుబు, దగ్గు రావడం, మొటిమలు, ఆందోళన.. ఇవి థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్ సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి. థైరాయిడ్ బయటపడితే రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. శరీరంలో థైరాయిడ్ (Thyroid)హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మందులు అవసరం. అయితే కేవలం మందులు మాత్రం తీసుకుంటే సరిపోదు. కొన్ని ఆహార జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. థైరాయిడ్ (Thyroid)సమస్య ఉన్న రోగులు అస్సలు తినకూడని 5 ఆహారాలు ఇవే. వీటిని తింటే తీసుకునే మందుల ప్రభావాన్ని కూడా పాడు చేస్తాయి. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు సోయా ఆహారాలకు దూరంగా (Avoid soy foods)ఉండాలని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది థైరాయిడ్ (Thyroid)మందులు సరిగా పనిచేయకపోవడానికి కారణమవుతుంది.
సోయాబీన్స్, సోయా పాలు, టోఫు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు క్యాబేజీ వంటి కూరగాయలకు దూరంగా ఉండాలి.ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు థైరాయిడ్ రోగుల్లో బరువును పెంచుతాయి. శారీరక సమస్యలను పెంచుతాయి. ఇటువంటి ఆహారాలలో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.మీకు థైరాయిడ్ ఉంటే స్వీట్లను తినడం మానుకోవాలి. మితంగా చక్కెర తినాలి. ఇవి థైరాయిడ్ సమస్యలున్న వారు బరువును మెయింటైన్ చేయడం కష్టతరం చేస్తాయి. కాబట్టి తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి తింటే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు ఎక్కువగా కాఫీని తాగకూడదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగ కూడదు. థైరాయిడ్ మందులు తీసుకునే అరగంట ముందు, తర్వాత కూడా కాఫీ తాగకూడదు. కాదని తాగితే సమస్య మరింత పెడుతుందని అంటున్న ఆరోగ్య నిపుణులు.
థైరాయిడ్ సమస్యకు కారణాలు ఏమిటి?
థైరాయిడ్ సమస్యలకు కారణమేమిటి? థైరాయిడ్ సమస్యలు ఈ క్రింది కారణాల వల్ల సంభవించవచ్చు. అయోడిన్ లోపం . ఆటో ఇమ్యూన్ వ్యాధులు – మీ రోగనిరోధక వ్యవస్థ మీ థైరాయిడ్‌ను దాడి చేసినప్పుడు – గ్రేవ్స్ వ్యాధి లేదా హషిమోటో వ్యాధి వంటివి.
థైరాయిడ్ రకాలు?
థైరాయిడ్ వ్యాధులలో ముఖ్యంగా రెండు రకాలున్నాయి: హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ హార్మోన్) మరియు హైపర్ థైరాయిడిజం (అధిక థైరాయిడ్ హార్మోన్). వీటితో పాటు, థైరాయిడ్ గ్రంధికి క్యాన్సర్ వంటి ఇతర సమస్యలు కూడా రావచ్చు.
ఏ అవయవం వల్ల థైరాయిడ్ వస్తుంది?
థైరాక్సిన్ మరియు ట్రైఅయోడోథైరోనిన్ ఉత్పత్తి ప్రధానంగా పూర్వ పిట్యూటరీ గ్రంథి ద్వారా విడుదలయ్యే థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) ద్వారా నియంత్రించబడుతుంది. TSH విడుదల థైరోట్రోపిన్ విడుదల చేసే హార్మోన్ (TRH) ద్వారా ప్రేరేపించబడుతుంది, ఇది హైపోథాలమస్ నుండి పల్సటైల్ పద్ధతిలో విడుదలవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: