📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Thyroid : ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నా థైరాయిడ్అదుపులోకి రావ‌డం లేదా..

Author Icon By Sudha
Updated: February 11, 2026 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్ర‌స్తుత‌కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ ఒక‌టి. ప్ర‌తి ప‌ది మందిలో ఒక‌రు హైపోథైరాయిడిజంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ స‌మ‌స్య‌తో ఎక్కువ‌గా ఇబ్బందిప‌డుతున్నారు. థైరాయిడ్ (Thyroid)స‌మ‌స్య‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి రోజూ కొన్ని ల‌క్ష‌ల మంది థైరాయిడ్ (Thyroid)ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా మంది థైరాయిడ్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్న‌ప్ప‌టికీ దాని ఫ‌లితాలు స‌రిగ్గా లేవ‌ని, ట్యాబ్లెట్ల‌ను వేసుకున్న‌ప్ప‌టికీ బ‌రువు పెర‌గ‌డం, అల‌స‌ట‌, శ‌క్తి లేక‌పోవ‌డం, జుట్టు రాల‌డం, పొడి చ‌ర్మం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూనే ఉన్నామ‌ని చెబుతుంటారు. ట్యాబ్లెట్ల‌ను వేసుకున్న‌ప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

Read Also : http://Detox Drinks: కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే సహజ పానీయాలు ఇవే

Thyroid

హార్మోన్లు త‌గినంత ఉత్ప‌త్తి కాకపోవ‌డం

మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒక‌టి. గొంతు కింద భాగంలో సీతాకోక‌చిలుక ఆకారంలో ఈ గ్రంథి ఉంటుంది. శ‌రీరంలో శ‌క్తి ఉత్ప‌త్తి, వినియోగం, నిల్వ‌ల‌ను నియంత్రించే కీల‌క విధుల‌ను ఈ గ్రంథి నిర్వర్తిస్తుంది. మెద‌డులోని పిట్యూట‌రీ గ్రంథి థైరాయిడ్ గ్రంథి కార్య‌క‌ల‌పాల‌ను నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ టి-4 ( ర‌క్తంలో ఎక్కువ‌గా ఉండే హార్మోన్) , ట్రైయోడోథైరొనిన్ టి-3 ( క‌ణ స్థాయిలో ప‌నిచేసే క్రియాశీల హార్మోన్)ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఈ హార్మోన్ల స్థాయిల‌ను బ‌ట్టే థైరాయిడ్ నిర్దార‌ణ‌, చికిత్స జ‌రుగుతుంది. థైరాయిడ్ హార్మోన్లు త‌గినంత ఉత్ప‌త్తి కాకపోవ‌డం వ‌ల్ల హైపోథైరాయిడిజం స‌మ‌స్య వ‌స్తుంది. అల‌స‌ట‌, బ‌రువు పెర‌గ‌డం, చ‌లిని త‌ట్టుకోలేకోవ‌డం దీని ల‌క్ష‌ణాలు. అయోడిన్ లోపం, థైరాయిడ్ గ్రంథి తొల‌గింపు, పిట్యూట‌రీ గ్రంథి లోపాలు, హ‌షిమోటో అనే వ్యాధి కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మైటోకాండ్రియా అనేవి క‌ణాల్లో శ‌క్తిని ఉత్ప‌త్తి చేసే నిర్మాణాలు. ఇవి పోష‌కాల‌ను శ‌క్తిగా మార్చి శ‌రీరంలో అన్ని అవ‌య‌వాల‌కు శ‌క్తిని అందిస్తాయి. మైటోకాండ్రియా ఆరోగ్యం బాగుంటేనే థైరాయిడ్ హార్మోన్లు స‌రిగా త‌యార‌వుతాయి. మైటోకాండ్రియా శ‌క్తి ఉత్పత్తి తగ్గితే హార్మోన్లు ఉన్నా వాటి ప్ర‌భావం త‌గ్గుతుంది.

జీవ‌న‌శైలిలో మార్పులు అవసరం

థైరాయిడ్ హార్మోన్లు స‌రిగ్గా ఉన్నా క‌ణాల శ‌క్తి బ‌ల‌హీనంగా ఉంటే జీవ‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. క‌నుక మందులు వాడిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌లు త‌గ్గవ‌ని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ స‌మ‌స్య‌ను హార్మోన్ల స‌మ‌స్య‌గా కాకుండా క‌ణ‌శ‌క్తి స‌మ‌స్య‌గా చూడాల‌ని వారు చెబుతున‌న్నారు. క‌ణ‌శ‌క్తి స్థాయినిపెంచ‌డానికి ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఐర‌న్, విట‌మిన్ బి, మెగ్నీషియం లోపాలు లేకుండా చూసుకోవాలి. నిద్ర‌లేమి, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. కండ‌ర వ్యాయామాలు చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవ‌డం త‌గ్గించాలి. ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డంతో పాటు జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ వ‌ల్ల వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Hypothyroidism latest news Telugu News Thyroid thyroid not under control thyroid problem thyroid tablets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.