📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Throat Pain : గొంతు నొప్పి ఇతర స‌మ‌స్య‌ల‌కు వంటింటి చిట్కాలు!

Author Icon By Sudha
Updated: July 15, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గొంతు నొప్పి అనేది సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇది తాత్కాలికమైనదిగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమై ఇన్ఫెక్షన్‌ (infection)గా మారవచ్చు.సీజ‌న్లు మారిన‌ప్పుడు లేదా వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ల కార‌ణంగా, క‌ఫం అధికంగా పేరుకుపోవ‌డం, ప‌డ‌ని ఆహారాల‌ను తిన‌డం వంటి కార‌ణాల వ‌ల్ల గొంతు నొప్పి (Throat Pain)వ‌స్తుంది. దీంతోపాటు గొంతులో గ‌ర‌గ‌రగా, మంట‌గా కూడా ఉంటుంది. కొంద‌రికి ద‌గ్గు కూడా వ‌స్తుంది. అయితే ఇలాంటి గొంతు స‌మ‌స్య‌లు (Throat Pain)ఉంటే చాలా మంది టానిక్‌ల‌ను తెచ్చుకుని తాగుతారు లేదా మెడిసిన్‌ను వేసుకుంటారు. కానీ మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే స‌హ‌జ‌సిద్ధంగా గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు నొప్పి(Throat Pain) లేదా ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఉప్పు నీరు బాగా ప‌నిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త ఉప్పు వేసి క‌లిపి ఆ నీళ్ల‌ను గొంతులో పోసుకుని పుక్కిట ప‌ట్టాలి. ఇలా చేస్తుంటే స‌త్వ‌ర‌మే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Throat Pain : గొంతు నొప్పి ఇతర స‌మ‌స్య‌ల‌కు వంటింటి చిట్కాలు!

తేనెతో స‌మ‌స్య‌కు పరిష్కారం

గొంతు నొప్పిని త‌గ్గించ‌డంలో తేనె కూడా అద్భుతంగానే ప‌నిచేస్తుంది. ఇందులో స‌హ‌జ‌సిద్ధ‌మైన డిమ‌ల్సెంట్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. గొంతు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. తేనెను 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో రోజుకు 3 సార్లు సేవిస్తుండాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి రోజుకు 3 సార్లు తాగాలి. అల్లం టీలోనూ తేనె క‌లిపి తాగితే ఉప‌యోగం ఉంటుంది. గొంతు స‌మ‌స్య‌ల నుంచి స‌త్వ‌ర‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే ఏడాది క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు తేనెను ఇవ్వ‌కూడ‌దు.

అతి మధురం వేరు ముక్క‌

గొంతు నొప్పి లేదా ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు హెర్బ‌ల్ టీలు బాగా ప‌నిచేస్తాయి. ఇవి గొంతులో ఉండే క‌ఫాన్ని తొల‌గిస్తాయి. ఈ టీల‌లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. ఈ టీల‌ను సేవించ‌డం వ‌ల్ల నొప్పుల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్క‌ల‌ను వేసి మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే నీళ్ల‌ను వ‌డ‌క‌ట్టి అందులో కాస్త తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగాలి. ఈ క‌షాయాన్ని రోజుకు 2 సార్లు తాగాల్సి ఉంటుంది. దీంతో గొంతు స‌మ‌స్య‌లు తగ్గుముఖం ప‌డ‌తాయి. గొంతు స‌మ‌స్య‌ల‌కు అతి మ‌ధురం కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. చిన్న అతి మధురం వేరు ముక్క‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను తాగుతున్నా కూడా గొంతులో నొప్పి, మంట త‌గ్గిపోతాయి. ముక్కు దిబ్బ‌డ నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Throat Pain : గొంతు నొప్పి ఇతర స‌మ‌స్య‌ల‌కు వంటింటి చిట్కాలు!

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

పుదీనా ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు గొంతు నొప్పి, మంట‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. పాల‌లో ప‌సుపు క‌లిపి తాగుతున్నా కూడా ఈ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వచ్చు. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 2 సార్లు తాగాల్సి ఉంటుంది. మెంతుల‌ను నీటిలో వేసి మ‌రిగించి అనంత‌రం వచ్చే నీళ్ల‌ను వ‌డ‌క‌ట్టి అందులో కాస్త తేనె క‌లిపి తాగుతుండాలి. రోజుకు దీన్ని 3 సార్ల వ‌ర‌కు తాగ‌వ‌చ్చు. గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ కూడా ప‌నిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి రోజుకు 2 సార్లు తాగుతుంటే ఫ‌లితం ఉంటుంది. ఇలా ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ఉప‌యోగించి గొంతు నొప్పి, ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

గొంతు నొప్పి ఎలా వస్తుంది?

గొంతు నొప్పికి అత్యంత సాధారణ కారణం జలుబు లేదా ఫ్లూ, గ్లాండ్లర్ జ్వరం వంటి వైరస్ నుండి వచ్చే ఇన్ఫెక్షన్ . 3 గొంతు నొప్పిలో 1 కంటే తక్కువ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కొన్ని గొంతు నొప్పి స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ (స్ట్రెప్ A) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనిని కొన్నిసార్లు ‘స్ట్రెప్ థ్రోట్’ అని పిలుస్తారు.

గొంతు నొప్పి మొదటి లక్షణం?

జలుబు వైరస్ సోకిన ఒకటి నుండి మూడు రోజుల్లోపు, మీరు మీ గొంతులో చక్కిలిగింతను గమనించవచ్చు. జలుబు ఉన్న వారిలో సగం మంది తమ మొదటి లక్షణంగా చక్కిలిగింత లేదా గొంతు నొప్పిని నివేదిస్తారు. ఈ ప్రారంభ దశలో మీరు అనుభవించే ఇతర సాధారణ జలుబు లక్షణాలు: తుమ్ములు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Thirst at night :రాత్రిపూట దాహం వేస్తుందా? తేలిగ్గా తీసుకోకండి..

Breaking News home remedies Kitchen tips latest news natural treatment sore throat Telugu News throat infection throat pain

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.