📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Egg : ప్రతి రోజూ కోడిగుడ్డు తింటే ఎన్నో లాభాలు..

Author Icon By Sudha
Updated: June 23, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోడిగుడ్డు (Chicken egg)అనేది సహజంగా లభించే అత్యుత్తమ పోషకాహార వనరు (A source of nutrition). ఇది అన్ని వయసుల వారికి అనువైనది మరియు ఆరోగ్యానికి బలాన్నిచ్చే ఆహారాల్లో ప్రధాన స్థానాన్ని (Main position)ఆక్రమించింది.

Egg : ప్రతి రోజూ కోడిగుడ్డు తింటే ఎన్నో లాభాలు..

ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి. ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
శక్తిని అందిస్తుంది
కోడి గుడ్లలో అధిక ప్రోటీన్స్ , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది తప్పకుండా ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినాలని చెబుతుంటారు. క్రమం తప్పకుండా గుడ్లు తినడం వలన ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఒక కోడి గుడ్డులో దాదాపు 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల ఆరోగ్య కరమైన కొవ్వులు ఉంటాయి.
హృదయ సంబంధ వ్యాధులకు చెక్
కోడి గడ్డును ఉడక బెట్టి లేదా గిలకొట్టి ఏవిధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువగా బాయిల్డ్ ఎగ్ శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది గుండె పోటు, స్ట్రోక్, లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుందంట. అంతే కాకుండా రక్త నాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కోడి గుడ్డు గుండె పనితీరును మెరుగు పరచడమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇది దడు పనితీరును పెంచుతుంది. మెదడు ఆరోగ్యానికి కీలకమైన పోషకం అయిన కోలిన్ యొక్క ఉత్తమ వనరులలో గుడ్లు ఒకటి. కోలిన్ జ్ఞాపకశక్తి, మానసిక స్థితి,అభిజ్ఞా పనితీరుకు మద్దతు ఇస్తుంది. తగినంత కోలిన్ తీసుకోవడం వల్ల వృద్ధులలో అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక గుడ్డులో దాదాపు 147 మి.గ్రా. కోలిన్ ఉంటుంది.
కంటి ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది
కంటి ఆరోగ్యానికి కూడా గుడ్లు చాలా మంచివి. కంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది కంటి ఆరోగ్యానికి మెరుగు పరుస్తుంది. ఎందుకంటే గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు సంబంధిత మాక్యులర్ డీజనరేషన్ కంటి శుక్లం నుంచి రక్షిస్తుంది. అంతే కాకుండా ప్రతి రోజు గుడ్డు తినడం వలన ఇది కంటి చూపు మెరుగు పడేలా చేస్తుంది.
దృఢమైన ఎముకలకు గుడ్లు చాలా మంచివి. ఇందులో విటమిన్ డీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతే కాకుండా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వలన ఇది ఎములకు తగినంత డీ విటమిన్ అందించడమే కాకుండా, ఎముకల వ్యాధులను తగ్గిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. అందుకే ప్రతి రోజు ఒక గుడ్డు తినాలంటారు నిపుణులు.

Read Also:Cinnamon Tea: దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య

#EggNutrition #HealthyFats #HealthyLiving #NaturalVitamins #ProteinRich #SuperFood an egg every day. Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today There are many benefits to eating Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.