📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Sweet Corn Benifits :స్వీట్ కార్న్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

Author Icon By Sudha
Updated: July 10, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వీట్ కార్న్‌ అనేది మనకు అందరికీ తెలిసిన రుచికరమైన చిరుతిండి. సినిమా హాళ్లలో, వీధి పక్కల స్టాల్స్‌లో, పాపకార్న్‌లా లేదా బటర్‌తో కలిపి తీసుకునే ఈ తినుబండారానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ దీని రుచి మాత్రమే కాదు – పోషక విలువల (Nutritional values)పరంగా కూడా ఇది చాలా ఆరోగ్యకరం. పోషకాహార నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, స్వీట్ కార్న్‌ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
స్వీట్‌కార్న్‌ (Sweet Corn Benifits) వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.

Sweet Corn Benifits :స్వీట్ కార్న్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

కంటి చూపును మెరుగు

స్వీట్‌కార్న్‌ (Sweet Corn Benifits)లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. స్వీట్ కార్న్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.జీర్ణ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వీట్ కార్న్ తినటం వల్ల మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

విటమిన్లు అధికం

Sweet Corn Benifits :స్వీట్ కార్న్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

బీ- 3, బీ- 5, బీ-6, బీ- 9 మొదలైన విటమిన్లు ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఫైటో కెమకిల్స్ ఎక్కువగా ఉంటాయి. స్వీట్ కార్న్ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కార్న్ లో ఉండే విటమిన్ బి12 అనీమియా తగ్గిస్తుంది. ఇది గర్భిణీలకు చాలా అవసరమైనది. అంతేకాదు..కార్న్‌లోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. స్వీట్‌కార్న్‌(Sweet Corn Benifits) లో లుటీన్, జియాక్సంతిన్ వంటి మూలకాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ రెండు కెరోటినాయిడ్లు కళ్ళకు ముఖ్యమైనవి. రక్తంలో చక్కర స్థాయి అదుపులో ఉంచడానికి స్వీట్‌కార్న్‌ మంచిది.స్వీట్‌కార్న్‌ తినటం వల్ల ఇది డయాబెటిస్, ప్రీడయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. స్వీట్‌కార్న్‌లో ఉండే ఫినాలిక్ కాంపౌండ్ ఫెరూలిక్ యాసిడ్, బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే ట్యూమర్స్ ను తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

స్వీట్ కార్న్ ఎందుకు మంచిది?

స్వీట్ కార్న్‌ ఆరోగ్యానికి మంచిది అనడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇది కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి.

రోజూ స్వీట్ కార్న్ తినవచ్చా?

చాలా వరకు, అవును అని రిజిస్టర్డ్ డైటీషియన్ ఎలిస్ హోమన్, MS, RD, LD అంటున్నారు. మొక్కజొన్నలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా మారుతుంది. అంటే మీరు దానిని నెమ్మదిగా జీర్ణం చేసుకుంటారు, కాబట్టి ఇది మీ రక్తంలో చక్కెరలో అకస్మాత్తుగా, అనారోగ్యకరమైన స్పైక్‌కు కారణం కాదు.

స్వీట్ కార్న్ రోజుకు ఎన్ని తినాలి?

సాధారణంగా 1 కప్పు (అంచనా గా 100–150 గ్రాములు) స్వీట్ కార్న్‌ తీసుకోవడం తగిన మోతాదుగా భావిస్తారు.ఇది స్నాక్‌ రూపంలో లేదా పక్కకూర (side dish) రూపంలో తీసుకోవచ్చు. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండే ఇతర ఆహారాలతో కలిపి తింటే మోతాదు తగ్గించాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Breast cancer: మహిళల్లో బ్రెస్ట్ కాన్సర్ కి కారణాలు

Breaking News fiber rich foods Healthy Snacks latest news nutrition sweet corn sweet corn benefits TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.