📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Spinach : పాల‌కూర‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు ..

Author Icon By Sudha
Updated: January 6, 2026 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో సూక్ష్మ పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ఆకుకూర‌లల్లో పాల‌కూర కూడా ఒక‌టి. దీనిలో కూడా పోష‌కాలు అధికంగా ఉంటాయి. స‌లాడ్ రూపంలో, ప‌ప్పు, కూర రూపంలో పాల‌కూర‌ (Spinach)ను మ‌నం తీసుకుంటూ ఉంటాం. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న మొత్తం శ‌రీరానికి పాల‌కూర (Spinach)చేసే మేలు అంతా ఇంతా కాదు. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే ప్రయోజ‌నాల గురించి, అలాగే దీనిని తీసుకోద‌గిన వివిధ రూపాల గురించి పోషకాహార వైద్య నిపుణులు వివ‌రిస్తున్నారు. పాల‌కూర‌లో విట‌మిన్ ఎ, సి, కె1 ల‌తో పాటు ఫోలేట్, ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి.

Read Also: Health: గుమ్మడి గింజలు రోజూ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు

Spinach

క్యాన్స‌ర్ నివార‌ణ‌కు

పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. అలాగే పాల‌కూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. బీటాకెరోటీన్, లుటీన్, జియాక్సంతిన్, క్లోరోఫిల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ రాడిక‌ల్స్ నుండి శ‌రీరాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. దీంతో దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. పాల‌కూర‌లో క్యాన్స‌ర్ నివార‌ణ‌కు దోహ‌ద‌ప‌డే స‌మ్మేళ‌నాలు కూడా ఉంటాయి. క‌నుక పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల క్యాన్స‌ర్ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా పాల‌కూర మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. పాల‌కూర‌లో నైట్రేట్ ఉంటుంది. ఇది ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.

చ‌క్కెర స్థాయిలు అదుపులో

అంతేకాకుండా పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. అలాగే పాల‌కూర త‌క్కువ గ్లైసెమిక్ స్థాయిల‌ను క‌లిగి ఉంటుంది. అంతేకాకుండా పాల‌కూర‌లో ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక చ‌క్కెర‌ల‌ను నెమ్మ‌దిగా ర‌క్తంలోకి విడుద‌ల చేస్తుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మ‌ద్ద‌తును ఇవ్వ‌డంలో కూడా పాల‌కూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య త‌గ్గుతుంది. దీనిలో నీటిశాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ప్రేగుల‌ క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. పాల‌కూర‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. నీరు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యవంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ విధంగా పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Spinach

ఎలా తీసుకోవచ్చంటే..

ఇక పాల‌కూర‌తో మ‌నం పాల‌కూర స్ట‌ఫ్డ్ చికెన్ బ్రెస్ట్, పాల‌కూర, పుట్ట‌గొడుగు క్విచే, పాల‌కూర బెర్రీ స్మూతీ, పాల‌కూర డిప్ వంటి వాటిని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా మంది పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయ‌ని చాలా మంది దీనిని పూర్తిగా తీసుకోవ‌డ‌మే మానేస్తారు. కానీ ఇత‌ర ఆకుకూర‌ల లాగా పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని వైద్యులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News health benefits healthy food latest news nutrition Palak Spinach Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.