हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

టాటూలు వేయించుకునేవారికి షాకింగ్ న్యూస్

Anusha
టాటూలు వేయించుకునేవారికి షాకింగ్ న్యూస్

ఇటీవల కాలంలో టాటూలు వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. సామాన్య ప్రజల నుంచి ప్రముఖులు వరకు చాలా మంది తమ శరీరంపై టాటూలను వేయించుకుంటున్నారు. సెలబ్రిటీల ప్రభావంతో యూత్ కూడా విపరీతంగా టాటూల పిచ్చి పెంచుకుంటున్నారు. దీంతో టాటూ షాపులు గల్లీ గల్లీకి పుట్టుకొస్తున్నాయి. కానీ తాజాగా, టాటూల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అనారోగ్య సమస్యలు

టాటూలకు ఉపయోగించే ఇంక్ లో హానికరమైన రసాయనాలు ఉండటంతో,ఇటీవల కాలంలో చర్మ క్యాన్సర్, హెచ్ఐవి హైపర్టిస్ వంటి ప్రాణాంతకరమైనటువంటి జబ్బులు పెరుగుతున్నాయని వీటికి పచ్చబొట్లు వేసుకోవడం కూడా ఒక కారణమని తెలిపారు.

టాటూ సిరా

కొన్ని టాటూ సిరాలలో భారీ లోహాలు, కెమికల్స్ ఉండటంతో చర్మ సమస్యలు, అలర్జీలు, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.నాసిరకం ఇంక్ వల్ల రక్తంలోకి హానికరమైన పదార్థాలు వెళ్లి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే అవకాశముంది.

అసురక్షితమైన టాటూ పార్లర్లు

స్టెరిలైజేషన్ లేకుండా పాత సూదులు వాడితే హెచ్ఐవి , హైపటైటిస్ బి, హైపటైటిస్ సి లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.హైజీన్ పాటించని టాటూ స్టూడియోలు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.ఇటీవల, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి టాటూల కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.టాటూల వల్ల చర్మ క్యాన్సర్, హెచ్ఐవి, హైపటైటిస్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

compass tattoo ideas

తెలుగు రాష్ట్రాల్లో టాటూలు

సినిమా హీరోల నుంచి సామాన్య ప్రజల వరకు టాటూల ప్రియులు ఎక్కువవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం టాటూలు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వేయించుకునేవారు. కానీ ఇప్పుడు, టాటూ లేకుంటే ట్రెండ్స్‌ను ఫాలో కావడం లేదనే భావన ఏర్పడింది.సెలబ్రిటీలను చూసి ప్రేరణ పొందుతూ యువత భారీ టాటూలను వేయించుకుంటున్నారు.బాడీ ఆర్ట్‌ను ఫ్యాషన్‌గా భావిస్తున్నప్పటికీ, ఆరోగ్య పరంగా పెద్ద ముప్పుగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రామాణికమైన టాటూ స్టూడియోలనే ఎంపిక చేసుకోవాలి.సిరాలో హానికరమైన కెమికల్స్ తనిఖీ చేసుకోవాలి.కొత్తగా అనుమతించబడిన సూదులు మాత్రమే ఉపయోగించాలి.టాటూ చేసిన తర్వాత దాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోవాలి, ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.అలర్జీ రియాక్షన్ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.టాటూల మోజులో పడే ముందు, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఫ్యాషన్ మోజు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదు. అందుకే, సురక్షితమైన టాటూ స్టూడియోలనే ఎంచుకోవడం, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

టాటూలతో హెచ్ఐవి, క్యాన్సర్ ముప్పు ఉందని నియంత్రణకు కొత్త నిబంధనలు తేవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రానికి ఓ లేఖను రాశారు. టాటూకు ఉపయోగించే సిరా దృశ్య ప్రభావం చూపుతోందని టాటూ పార్లర్లను నియంత్రించే చట్టం రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇటీవల కాలంలో చర్మ క్యాన్సర్, హెచ్ఐవి హైపర్టిస్ వంటి ప్రాణాంతకరమైనటువంటి జబ్బులు పెరుగుతున్నాయని వీటికి పచ్చబొట్లు వేసుకోవడం కూడా ఒక కారణమని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870