हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Seeds : పంటకు విత్తనాలు ఎలాగో.. ఆరోగ్యానికి విత్తనాలు అలాగా..

Sudha
Latest Telugu News : Seeds : పంటకు విత్తనాలు ఎలాగో.. ఆరోగ్యానికి విత్తనాలు అలాగా..

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాల‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాల‌ను తింటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని పోషకాలు ల‌భించి పోష‌కాహార లోపం త‌గ్గుతుంది. అనేక వ్యాధుల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు. అయితే పౌష్టికాహారాల విష‌యానికి వ‌స్తే ప‌లు ర‌కాల విత్త‌నాలు వాటిల్లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల విత్త‌నాలు (Seeds) అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. విత్త‌నాల‌ను (Seeds)తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. పైగా శ‌రీరానికి శ‌క్తి కూడా ల‌భిస్తుంది. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది.

 Seeds : పంటకు విత్తనాలు ఎలాగో.. ఆరోగ్యానికి విత్తనాలు అలాగా..
Seeds : పంటకు విత్తనాలు ఎలాగో.. ఆరోగ్యానికి విత్తనాలు అలాగా..

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల విత్త‌నాల్లో (Seeds)అవిసె గింజ‌లు కూడా ఒక‌టి. వీటిల్లో ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక‌లిని నియంత్రిస్తాయి. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇవి బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి లేదా పెనంపై కాస్త వేయించి సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ లా తింటుండాలి. దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది. అవిసె గింజ‌ల‌ను తింటుంటే బీపీని త‌గ్గించుకోవ‌చ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. అలాగే చియా సీడ్స్ కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ ల‌భిస్తాయి. చియా విత్త‌నాల‌ను తింటుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గుతాయి. శ‌రీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ..

మ‌న‌కు నువ్వులు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఫైబ‌ర్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌లు పుష్క‌లంగా ఉంటాయి. నువ్వుల‌ను తింటే క్యాల్షియం స‌మృద్ధిగా ల‌భించి ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. మ‌హిళ‌ల్లో హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శారీర‌క శ్ర‌మ లేదా వ్యాయామం చేసేవారు నువ్వుల‌ను తింటుంటే కండ‌రాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కండ‌రాలు సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను కూడా రోజూ తిన‌వ‌చ్చు. రోజూ గుప్పెడు మోతాదులో వీటిని నాన‌బెట్టి లేదా కాస్త వేయించి తిన‌వ‌చ్చు. సాయంత్రం స్నాక్స్ రూపంలో వీటిని తినాలి. ఈ విత్త‌నాల‌ను తింటుంటే క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. విట‌మిన్ ఇ అధికంగా ల‌భిస్తుంది. క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గ‌ర్భిణీల‌కు మేలు చేస్తాయి.

 Seeds : పంటకు విత్తనాలు ఎలాగో.. ఆరోగ్యానికి విత్తనాలు అలాగా..
Seeds : పంటకు విత్తనాలు ఎలాగో.. ఆరోగ్యానికి విత్తనాలు అలాగా..

విత్త‌నాల్లో జింక్ అధికం

రోజూ గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటున్నా ఎంతో మేలు జ‌రుగుతుంది. వీటిల్లో అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ ఉంటాయి. గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో అధికంగా ఉండే మెగ్నిషియం వ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. బ‌ద్ద‌కం పోతుంది. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. నిద్ర‌లేమి త‌గ్గుతుంది. ఈ విత్త‌నాల్లో జింక్ అధికంగా ఉంటుంది క‌నుక రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. వీటిల్లో ఉండే ఆరోగ్యక‌ర‌మైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా ప‌లు ర‌కాల విత్త‌నాల‌ను రోజూ తింటుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. వీటిని అన్నింటినీ క‌లిపి రోజుకు ఒక గుప్పెడు మోతాదులో కూడా తిన‌వ‌చ్చు. నీటిలో నాన‌బెట్టి తింటే తేలిగ్గా జీర్ణం అవ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను పూర్తి స్థాయిలో పొంద‌వ‌చ్చు. ఇలా ఆయా విత్త‌నాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

విత్తనాల వల్ల ఉపయోగాలు ఏమిటి?

మార్కెట్​లో దానిమ్మ, అవిసె, పొద్దుతిరుగుడు, పుచ్చ‌కాయ‌, చియా, క్వినోవా, నువ్వులు లాంటి చాలా ర‌కాల గింజ‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ గింజ‌ల్లో విట‌మిన్లు, ప్రొటీన్లు, మిన‌ర‌ల్స్, కాల్షియం ల‌భిస్తాయి. కనుక వీటిని కొద్ది మోతాదులో తీసుకున్నా.. మంచి పోష‌కాలు మ‌న‌కు లభిస్తాయి. ఈ గింజ‌ల్ని స్నాక్స్ లాగా, ప్రొటీన్ బార్స్​లాగా తీసుకోవ‌చ్చు. వీలుంటే లడ్డూల మాదిరిగా చేసుకుని ఆరగించవచ్చు. అలాగే ఈ గింజలను రాత్రి నాన‌బెట్టి ఉద‌యాన్నే తిన‌వ‌చ్చు.

మాంసాహారం ముట్ట‌ని వారు గింజలను తినాలి ?

మాంసాహారం ముట్ట‌ని వారికి.. మొక్కల గింజల్లోని పోష‌క ప‌దార్థాలు బాగా ఉపయోగపడతాయి. మొక్కల గింజల్లో కార్బొహైడ్రేట్లు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవి ఆహారంగా తీసుకుంటే.. శరీర బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు. ఈ గింజల్లో యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్​తో బాధ‌ప‌డేవారు వీటిని తిన‌డం ద్వారా వాటిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

📢 For Advertisement Booking: 98481 12870