📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest Telugu News : sago pearls : స‌గ్గు బియ్యంతో క‌లిగే లాభాలు ఏమిటో తెలుసా..

Author Icon By Sudha
Updated: December 10, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాబుదానా లేదా స‌గ్గుబియ్యం గురించి అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా దీన్ని చాలా మంది తీపి వంట‌కాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీంతో పాయ‌సం లేదా పర‌మాన్నం వంటివి చేస్తారు. అయితే స‌గ్గు బియ్యం (sago pearls) వాస్త‌వానికి ఒక ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారం. అయిన‌ప్ప‌టికీ ఇది ఆరోగ్య‌క‌ర‌మైనదే అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని క‌ర్ర పెండ‌లం చెట్టుకు చెందిన దుంపల నుంచి త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఇది పూర్తిగా ఆరోగ్య‌క‌ర‌మైన‌దే. ఆయుర్వేదంలోనూ స‌గ్గుబియ్యానికి ఎంతో ప్రాధాన్య‌త క‌ల్పించారు. దీంతో ప‌లు ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తారు. స‌గ్గు బియ్యాన్ని (sago pearls)తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. దీన్ని పాయ‌సం లేదా జావ‌గా త‌యారు చేసి తీసుకుంటారు. ఇది మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసేందుకు స‌హాయం చేస్తుంది.

Read Also : http://Sweet potatoes: చిలగడదుంపల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

sago pearls

శ‌క్తి స్థాయిలు అధికం

స‌గ్గుబియ్యంలో పిండి ప‌దార్థాలు అధికంగా ఉంటాయి. క‌నుక దీంతో జావ త‌యారు చేసి తాగితే శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి. బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. స‌గ్గుబియ్యాన్ని ఉద‌యం తీసుకుంటే రోజంతా శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. స‌గ్గు బియ్యం మ‌న శరీరానికి చ‌లువ చేస్తుంది. క‌నుక దీన్ని ఎక్కువ‌గా వేస‌విలో తీసుకుంటారు. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ వేడి శ‌రీరం ఉంటుంది. లేదా కొంద‌రికి కారం, మ‌సాలా ఉండే ఆహారాల‌ను తింటే ప‌డ‌దు. అలాంటి సంద‌ర్భాల్లో స‌గ్గు బియ్యాన్ని తీసుకుంటే ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇది పొట్ట‌లో ఉండే అసౌకర్యాన్ని, విరేచ‌నాల‌ను, శ‌రీరంలోని వేడిని త‌గ్గిస్తుంది. స‌గ్గుబియ్యాన్ని పాలు లేదా నీటిలో ఉడికించి అందులో కాస్త చ‌క్కెర క‌లిపి తింటుండాలి. దీని వ‌ల్ల పొట్ట‌లో ఉండే అసౌక‌ర్యం, శ‌రీరంలోని వేడి త‌గ్గిపోతాయి.

అల్స‌ర్లు త‌గ్గిపోతాయి

స‌గ్గుబియ్యాన్ని తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు అన్నింటినీ త‌గ్గించుకోవ‌చ్చు. ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. అజీర్తి త‌గ్గుతుంది. గ్యాస్‌, అసిడిటీ నుంచి ఉప‌శ‌హ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. విరేచ‌నాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. స‌గ్గు బియ్యం తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. క‌నుక వృద్ధులు, పిల్లలు కూడా సుల‌భంగా తిన‌వ‌చ్చు. స‌గ్గు బియ్యాన్ని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తింటుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే అల్స‌ర్లు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా జీర్ణాశయం, పేగుల్లో ఉండే పుండ్లు మానుతాయి. పేగుల వాపుల నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. స‌గ్గు బియ్యంలో పిండి ప‌దార్థాల‌తోపాటు ప్రోటీన్లు, విట‌మిన్ సి, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరానికి పోష‌కాలు, శ‌క్తి రెండూ ల‌భిస్తాయి.

sago pearls

నీర‌సం త‌గ్గిపోతుంది

స‌గ్గు బియ్యంలో ఉండే క్యాల్షియం ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముక‌లు అతుక్కుంటున్న వారు వీటిని రోజూ తింటుంటే ఉప‌యోగం ఉంటుంది. ఎల్ల‌ప్పుడూ నీర‌సంగా, అల‌స‌ట‌గా, బ‌ద్ద‌కంగా ఉండేవారు కూడా స‌గ్గుబియ్యాన్ని తింటుండాలి. దీని వ‌ల్ల శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ప‌నిచేస్తారు. జ్వ‌రం వ‌చ్చిన వారికి ఆహారం తినాల‌నిపించ‌దు. అలాంటి వారు స‌గ్గు బియ్యాన్ని జావ‌గా త‌యారు చేసుకుని తాగుతుంటే ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. నీర‌సం త‌గ్గిపోతుంది. జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. స‌గ్గు బియ్యాన్ని తింటుంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రోజూ తింటుంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఇక స‌గ్గు బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 80 వ‌ర‌కు ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు స‌గ్గుబియ్యాన్ని తిన‌కూడ‌దు. ఇలా జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ దీన్ని తింటుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News health benefits healthy foods latest news nutrition Sago Pearls Sago Uses Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.