📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? నేటి బంగారం ధరలు ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్ ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు మాజీ చీఫ్ లకు నోటీసులు పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? నేటి బంగారం ధరలు ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్ ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు మాజీ చీఫ్ లకు నోటీసులు పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

Rice Water : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బియ్యం క‌డిగిన నీళ్లు వాడాలి..

Author Icon By Sudha
Updated: December 22, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జుట్టు ఆరోగ్యంగా, అందంగా, పొడ‌వుగా ఉండాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దీని కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆశించిన ఫ‌లితాల‌ను పొంద‌లేరు. ఎటువంటి ఖ‌ర్చు చేసే ప‌నిలేకుండా చాలా సుల‌భంగా, స‌హ‌జ సిద్దంగా మ‌నం జుట్టు అందాన్ని పెంపొందించుకోవ‌చ్చు. జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మ‌నకు బియ్యం క‌డిగిన నీళ్లు (Rice Water)ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. సాధార‌ణంగా బియ్యం క‌డిగిన నీటిని(Rice Water) ఎటువంటి అవ‌స‌రాల‌కు ఉప‌యోగించ‌ము. కానీ బియ్యం క‌డిగిన నీటిలో ఎన్నో అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఇవి ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. బియ్యం క‌డిగిన నీటిని వృధా చేయ‌కుండా వీటిని జుట్టుకు మాస్క్ లాగా వేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also: http://Copper Jewellery : రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో ?

Rice Water

జుట్టు కుదుళ్లు బ‌ల‌ప‌డ‌తాయి

బియ్యం క‌డిగిన నీటిలో సిస్టిన్ అనే ఆమైనో ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే కెరాటిన్ అనే ప్రోటీన్ త‌యారీలో ఉప‌యోగ‌ప‌డుతుంది. బియ్యం క‌డిగిన నీటిని జుట్టుకు మాస్క్ లాగా వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు నిర్మాణాన్ని బ‌లోపేతం చేస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బ‌ల‌ప‌డ‌తాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు పొడిబార‌డం, జుట్టు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. బియ్యం క‌డిగిన నీటిలో విట‌మిన్లు, ఖ‌నిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇనోసిటాల్ అనే కార్బొహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. బియ్యం క‌డిగిన నీటిని జుట్టు రాయ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్ల‌కు కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. బియ్యం క‌డిగిన నీటిలో ఉండే ఆమైనో ఆమ్లాలు, విట‌మిన్లు కూడా జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. దీని వ‌ల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. ప‌లుచ‌గా ఉన్న జుట్టు కూడా చిక్క‌గా త‌యార‌వుతుంది.

జుట్టు రాల‌డం త‌గ్గుతుంది

బియ్యం క‌డిగిన నీటిలో స్టార్చ్, చక్కెర‌లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డ‌ తాయి. అంతేకాకుండా బియ్యం క‌డిగిన నీటిని జుట్టుకు మాస్క్ లాగా వేయ‌డం వ‌ల్ల జుట్టు పొడిబార‌కుండా ఉంటుంది. దీంతో జుట్టు స‌హ‌జ మృదుత్వంతో పాటు మెరుపును కూడా పొందుతుంది. ఈ నీటిని త‌ర‌చూ ఉపయోగించ‌డం వ‌ల్ల జుట్టు ఆకృతి మెరుగుప‌డుతుంది. బియ్యం క‌డిగిన నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఫ్రీరాడిక‌ల్స్ నుండి జుట్టును దెబ్బ‌తిన‌కుండా కాపాడ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, యూవీ కిరణాల కార‌ణంగా జుట్టు ఎంతో దెబ్బ‌తింటుంది. ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారు, బ‌య‌ట ప‌నులు చేసే వారు జుట్టు సంర‌క్ష‌ణ‌కు బియ్యం క‌డిగిన నీటిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వచ్చు.

Rice Water

చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే త‌ల‌చ‌ర్మం ఆరోగ్యంగా ఉండ‌డం కూడా చాలా అవ‌స‌రం. బియ్యం క‌డిగిన నీటిలో మెగ్ని షియం అధికంగా ఉంటుంది. ఇది చ‌ర్మం పిహెచ్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో చ‌ర్మం పొడిబార‌డం, దుర‌ద వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. అలాగే ఈ నీటిలో ఆస్ట్రిజెంట్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. త‌ల‌చ‌ర్మంపై అద‌నంగా త‌యార‌య్యే నూనెను, మురికిని తొల‌గించ‌డంలో ఇవి మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా బియ్యం క‌డిగిన నీరు జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఈ నీటిని జుట్టుకు నేరుగా మాస్క్ గా వేయ‌డంతో పాటు జుట్టుకు వేసే వివిధ మాస్క్ ల‌లో కూడా ఈ నీటిని క‌లిపి వాడుకోవ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

beauty tips BreakingNews hair care healthy hair latest news natural remedies Rice water Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.