📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pop Corn: పాప్ కార్న్ మ‌న ఆరోగ్యానికి మంచిదేనా?

Author Icon By Sudha
Updated: December 29, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ‌నం ఆహారంగా తీసుకునే చిరుతిళ్ల‌ల్లో పాప్‌కార్న్ కూడా ఒకటి. పిల్ల‌లు దీనిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. పాప్‌కార్న్ ను ఎక్కువ‌గా సినిమా వీక్షించే స‌మ‌యంలో చిరుతిండిగా తింటూ ఉంటారు. టైంపాస్గా తీసుకునేదే అయినా పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటా యి. అయితే ఈ పాప్‌కార్న్ మార్కెట్ లో మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భిస్తుంది. ఇన్‌స్టాంట్ గా చేసుకునే ఈ పాప్‌కార్న్ (Pop Corn) లో ఉప్పు, బ‌ట‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి పాప్‌కార్న్ (Pop Corn)ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యా నికి ఎంతో హాని క‌లుగుతుంది. క‌నుక మ‌నం మైక్రోవేవ్ చేసుకోగ‌లిగిన ఎటువంటి ఫ్లేవ‌ర్స్ లేని పాప్‌కార్న్ ను మాత్ర‌మే తీసుకోవాలి. ఇలాంటి పాప్‌కార్న్ మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది.. వీటిలో ఉండే ముఖ్య‌మైన పోష‌కాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను పోష‌కాహార నిపుణులు వివ‌రిస్తున్నారు.

Read Also: http://Epilepsy Awareness: పిల్లల్లో మూర్ఛ వ్యాధిపై అప్రమత్తత అవసరం

Pop Corn

చ‌క్కెర స్థాయి అదుపులో

పాప్‌కార్న్ ను 100 శాతం తృణ‌ధాన్యాల‌తో త‌యారు చేస్తారు. క‌నుక దీనిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. దీనిలో ఉండే ఫైబ‌ర్ ప్రేగు క‌ద‌లిక‌ల‌ను పెంచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఈ గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల‌కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబ‌ర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులకు ఇది ఒక చ‌క్క‌టి చిరుతిండి అని చెప్ప‌వ‌చ్చు.

జుట్టు రాల‌డం తగ్గుతుంది

పాప్‌కార్న్ లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ ను న‌శింప‌జేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. అంతేకాకుండా పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్యం, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం, అల్జీమ‌ర్స్, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. పాప్‌కార్న్ లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండుగా ఉంటుంది. త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. త‌ద్వారా మ‌న శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది.

Pop Corn

ఆరోగ్యానికి ఎంతో మేలు

పాప్‌కార్న్ గ్లూటెన్ ర‌హిత‌మైన‌ది. క‌నుక బ్రెడ్ కు బ‌దులుగా ఏ రెసిపీలోనైనా పాప్‌కార్న్ ను వాడుకోవ‌చ్చు. చిరుతిండిగా తీసుకోవ‌డానికి కూడా ఇది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. ఈ విధంగా పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని ఉప్పు, కారం, వెన్న, చీజ్, క్యార‌మెల్ వంటి వివిధ ప్లేవ‌ర్స్ తో తీసుకోకూడ‌దు. ఇలా తీసుకుంటే మేలు జ‌ర‌గ‌డానికి బ‌దులుగా మ‌న శ‌రీరానికి తీవ్ర‌మైన హాని క‌లుగుతుంది. క‌నుక ఎటువంటి ఫ్లేవ‌ర్స్ లేకుండా ఉండే సాధార‌ణ పాప్‌కార్న్ గింజ‌ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. అప్పుడే మ‌నం వాటి వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Healthy Snacks is popcorn healthy latest news Popcorn popcorn health benefits popcorn nutrition Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.