📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Palm jaggery : తాటి బెల్లంతో అధిక బరువు సమస్యకు చెక్

Author Icon By Sudha
Updated: January 6, 2026 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాటి బెల్లం కేవలం రుచికే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. ఇది జీవక్రియలను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, దగ్గును తగ్గిస్తుంది. ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే తాటి బెల్లం (Palm jaggery) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది. మహిళల నెలసరి నొప్పులను తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. సాధారణంగా అందరూ చెరుకు నుండి తీసిన బెల్లం ఎక్కువగా వాడుతుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా తాటి బెల్లం(Palm jaggery) ట్రై చేశారా..? దీని ప్రయోజనాలు తెలిస్తే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని మరీ తెచ్చుకు తింటారు. అంతటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌ కలిగి ఉంది తాటిబెల్లం. బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే తాటి బెల్లాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియలను వేగవంతం చేసి శరీర బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లాన్ని రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు సమస్యలకు బాగా పనిచేస్తుంది.

Read Also: Health: గుమ్మడి గింజలు రోజూ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు

Palm jaggery

తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, వికారం, తిమ్మిర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఇందుకు తోడ్పడుతాయి. తాటి బెల్లంలో కాల్షియం, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తాటి బెల్లంలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికలు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. భోజనం చేసిన వెంటనే ఒక ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. చర్మానికి కూడా తాటిబెల్లం ఎంతో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News health benefits latest news natural sweetener Palm Jaggery Tati Bellam Telugu News Weight Control

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.