ఉల్లిపాయ, వెల్లుల్లి రెండూ సల్ఫర్ అధికంగా ఉండే పదార్థాలు. ఇవి జుట్టు పెరుగుదలకు, కుదుళ్లకు పోషణకు తోడ్పడతాయి. ఉల్లిపాయ రసం జుట్టును బలంగా చేసి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అయితే వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు, సెలీనియం, జింక్ ఉండటం వల్ల చుండ్రును తగ్గించి, తల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే..? జుట్టు సంరక్షణ కోసం ఇంటి చిట్కాలను అనుసరించే వారి సంఖ్య పెరుగుతోంది. అందులోనూ ఉల్లిపాయ రసం, వెల్లుల్లి (Onion and garlic)బాగా ప్రాచుర్యం పొందిన పదార్థాలు. ఈ రెండింటిలో ఏది జుట్టుకు, తలకు ఎక్కువ ప్రయోజనకరమో అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి (Onion and garlic)రెండింటిలోనూ సల్ఫర్ అనే ఒకే రకమైన సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఈ సల్ఫర్ జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టును బలంగా మార్చడంతో పాటు తల చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందేలా చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది కెరాటిన్, కొల్లాజెన్ వంటి ప్రోటీన్ల నిర్మాణంలో ముఖ్యమైన భాగం. ఉల్లిపాయ రసంలోని యాంటీఆక్సిడెంట్లు తల చర్మం, నరాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.
Read Also: Health: ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తింటున్నారా?
వెల్లుల్లి కూడా రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల వెల్లుల్లి కొద్దిగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. వెల్లుల్లిలో అధిక యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తలలో వచ్చే ఇన్ఫెక్షన్లు, చుండ్రుతో సమర్థవంతంగా పోరాడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్‌తో పాటు జుట్టు పెరుగుదలకు ముఖ్యమైనవైన సెలీనియం, జింక్ కూడా అధికంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు రాలడం అనేది తల చర్మం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. వెల్లుల్లి తల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి మరింత దోహదపడుతుంది కాబట్టి, ఇది కొద్దిగా ప్రత్యేకంగా నిలుస్తుంది. జుట్టు రాలడం అనేది వృద్ధాప్యం, హార్మోన్ల మార్పులు లేదా ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. అందుకే పూర్తి ఫలితం కోసం కేవలం ఉల్లిపాయ లేదా వెల్లుల్లిపైనే ఆధారపడకుండా సరైన జీవనశైలి మార్పులు చేసుకోవాలి. మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ రెండింటిని ఉపయోగించండి. గణనీయమైన మార్పులను చూడటానికి 10 నుంచి 15 వారాల పాటు వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: