ఆవాలు(Mustard) మన వంటల్లో కీలకమైన భాగం. పప్పులు, కూరలు, పచ్చళ్ళు, ఆవకాయలు—ఏదైనా వంటకానికైనా ఆవాల రుచిని ఊహించకపోవడం అసాధ్యం. రుచికి తోడు ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆవాల్లో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్(Good cholesterol) పెంచి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు తగ్గి, హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Read also: Beetroot: పిల్లల ఆరోగ్యానికి బీట్‌రూట్ ఎందుకు అవసరం?
అలాగే, ఆవపిండిలో ఉండే సెలీనియం అనే ఖనిజం శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం వంటి వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు, కీళ్ళు బలంగా ఉంటాయి. ఆవపిండిని నియమితంగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
చర్మం, జుట్టుకు కూడా ఆవాలు ఎంతో మేలు చేస్తాయి. ఆవాల్లో(Mustard) ఉండే విటమిన్ A, K, C చర్మం మెరిసేలా చేసి, ఏజింగ్ లక్షణాలు తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మంపై మొటిమలు, ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. ఆవనూనె వాడటం వల్ల గాయాలు త్వరగా నయం అవుతాయి. ఇది సోరియాసిస్, రింగ్‌వార్మ్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఆవపొడి లేదా గింజలు చేర్చుకోవచ్చు. అలాగే, ఆవనూనెను కూరగాయల వేపుడు, చేపల వంటకాలు లేదా సలాడ్‌లలో వాడడం ద్వారా రుచి మరియు ఆరోగ్యం రెండూ పొందవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: